రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా : బండ్ల గణేష్

హైదరాబాద్: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ తరపున షాద్ నగర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినా నిరాశే ఎదురైంది. ఇక టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న బండ్ల గణేష్.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. నా వ్యక్తిగత కారణాల తో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ […]

రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా : బండ్ల గణేష్
Follow us

|

Updated on: Apr 05, 2019 | 9:28 AM

హైదరాబాద్: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ తరపున షాద్ నగర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినా నిరాశే ఎదురైంది. ఇక టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న బండ్ల గణేష్.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. నా వ్యక్తిగత కారణాల తో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీ కి సంబంధించిన వాడిని కాదు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను అంటూ బండ్ల గణేష్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరోవైపు ఇటీవల ఇంటర్వ్యూ లో ఏపీ సీఎం గా పవన్ కళ్యాణ్ ను చూడాలనుకుంటున్నట్లు బండ్ల గణేష్ తన మనసులోని కోరికను వెల్లడించిన విషయం తెలిసిందే.