కొంప‌ముంచిన పానీపూరి..40మందికి అస్వస్థత‌

ఆదిలాబాద్ సిటీలో పానీపూరి కొంప‌ముంచింది. ఈ తినుబండారాన్ని తిని 40 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. క‌రోనా వ‌ల్ల‌ దేశం మొత్తం లాక్‌డౌన్ లో ఉంటే..సీటీలో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌ పానీపూరి సేల్స్ ఎలా నిర్వ‌హిస్తున్నార‌ని ఆదిలాబాద్ వాసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇష్యూపై సీరియ‌స్ గా స్పందించిన బాల‌ల హ‌క్క‌లు సంఘం..ఘ‌ట‌న‌కు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించింది. బాధ్యులపై వెంట‌నే చర్యలకు ఆదేశించాలని.. పిల్లలకు ప్ర‌భుత్వ ఖ‌ర్చుల‌తో మెరుగైన చికిత్సను అందించాలని కోరుతూ.. మానవ హక్కుల […]

కొంప‌ముంచిన పానీపూరి..40మందికి అస్వస్థత‌
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 26, 2020 | 3:36 PM

ఆదిలాబాద్ సిటీలో పానీపూరి కొంప‌ముంచింది. ఈ తినుబండారాన్ని తిని 40 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. క‌రోనా వ‌ల్ల‌ దేశం మొత్తం లాక్‌డౌన్ లో ఉంటే..సీటీలో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌ పానీపూరి సేల్స్ ఎలా నిర్వ‌హిస్తున్నార‌ని ఆదిలాబాద్ వాసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇష్యూపై సీరియ‌స్ గా స్పందించిన బాల‌ల హ‌క్క‌లు సంఘం..ఘ‌ట‌న‌కు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించింది. బాధ్యులపై వెంట‌నే చర్యలకు ఆదేశించాలని.. పిల్లలకు ప్ర‌భుత్వ ఖ‌ర్చుల‌తో మెరుగైన చికిత్సను అందించాలని కోరుతూ.. మానవ హక్కుల సంఘంలో పిటిషన్ దాఖలు చేసింది.

ఆదిలాబాద్ సిటీలోని ఖుర్షిద్‌నగర్‌, సుందరయ్య నగర్‌ కాలనీలకు చెందిన చిన్నారులు రోడ్డు ప‌క్క‌న‌ ఓ బండి వ‌ద్ద‌ పానీపూరి తిన్నారు. ఇంటికి వెళ్లిన ద‌గ్గ‌ర్నుంచి వారికి వాంతులు, విరేచనాలు అయ్యి.. తీవ్ర అస్వ‌స్థ‌కు గుర‌య్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో పానీపూరి తిన్న‌ మొత్తం 40 మంది పిల్ల‌ల‌ను రిమ్స్‌కు తరలించారు. వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నామ‌ని.. ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించిన టైమ్ లో ఆదిలాబాద్ నడిబొడ్డున తినుబండారాల విక్రయానికి ప‌ర్మిష‌న్ ఎలా ఇచ్చారన్నే ప్రశ్న తలెత్తుతోంది. ఆదిలాబాద్ పానిపూరి ఘటన నేపథ్యంలో ఏపీ సర్కారు అల‌ర్ట‌య్యింది. ఆంధ్రాలో పానీపూరి విక్రయాలకు ప‌ర్మిష‌న్ లేదని స్పష్టం చేసింది.

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?