పాన్‌కార్డుకు ఆధార్ లింక్ చేయాల్సిందే..

ఆగస్టు 31 తర్వాత పాన్‌కార్డు రద్దు కాబోతోంది.. కంగారు పడకండి. పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే రద్దు చేయనున్నారు. దీనికి ఇంకా 40 రోజుల సమయం ఉంది. ఈలోగా మీ పాన్‌కార్డుకు ఆధార్‌ లింక్ చేసుకుంటే సరి.. లేకపోతే ఇక అంతే సంగతులు అంటున్నారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీబీ) అధికారులు. ప్రస్తుతం దేశంలో 43 కోట్ల మంది పర్మినెంట్ ఎక్కౌంట్ నంబర్ కలిగి ఉన్నారు. అదే సమయంలో ఆధార్ కార్డు కలిగి ఉన్నవారు […]

పాన్‌కార్డుకు ఆధార్ లింక్ చేయాల్సిందే..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 09, 2019 | 3:59 PM

ఆగస్టు 31 తర్వాత పాన్‌కార్డు రద్దు కాబోతోంది.. కంగారు పడకండి. పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే రద్దు చేయనున్నారు. దీనికి ఇంకా 40 రోజుల సమయం ఉంది. ఈలోగా మీ పాన్‌కార్డుకు ఆధార్‌ లింక్ చేసుకుంటే సరి.. లేకపోతే ఇక అంతే సంగతులు అంటున్నారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీబీ) అధికారులు. ప్రస్తుతం దేశంలో 43 కోట్ల మంది పర్మినెంట్ ఎక్కౌంట్ నంబర్ కలిగి ఉన్నారు. అదే సమయంలో ఆధార్ కార్డు కలిగి ఉన్నవారు 120 కోట్ల మంది. వీరిలో 50 శాతం మాత్రమే తమ పాన్‌కార్డుకు ఆధార్‌ను లింక్ చేసుకున్నారు. ఒకవేళ గడువులోగా అనుసంధానించుకోకపోతే వచ్చేనెల 31 తర్వాత ఖచ్చితంగా పాన్‌కార్డు రద్దు కానుందని చెప్పారు.

ఒకవేళ రద్దయితే ఆ తర్వాత జరిపే ఆర్ధిక లావాదేవీలకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు అధికారులు. మరోవైపు పలు రుణాలు, క్రెడిట్ కార్డులు పొందడానికి చట్టవిరుద్దంగా అనేకమంది ఆధార్ కార్డుతో లింకప్ చేయని పాన్‌కార్డులను వినియోగించినట్టు తేలడంతో ఇలాంటి వారిపై ఆర్బీఐ కూడా సీరియస్ అయ్యింది. ఇదిలా ఉంటే.. పాన్‌కార్డులేకపోయినా ఆధార్ కార్డుతో పన్ను చెల్లించవచ్చంటూ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్ వంటి దేశాల్లో కొంతమంది భారతీయులు తమ పాన్‌కార్డులనే గుర్తింపు కార్డులుగా చెలామణీ చేస్తున్నారు. వీరంతా కూడా వచ్చేనెలాఖరుకల్లా ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోతే పాన్‌కార్డు రద్దయ్యే అవకాశాలున్నట్టుగా అధికారులు తెలిపారు.