AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుక్రుడి సంచారంతో వీరికి అదృష్టం! కెరీర్, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్

Shukra Gochar 2026: జ్యోతిషశాస్త్రంలో శుక్రుడి సంచారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 2026 నవంబర్ 6 నుంచి 22 వరకు శుక్రుడు కన్యారాశిలో సంచరించనున్నాడు. ఈ 17 రోజుల కాలంలో ఐదు రాశుల వారికి అదృష్టం కలిసిరానుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఉద్యోగంలో పురోగతి, ఆర్థిక లాభాలు, వ్యాపారంలో కొత్త అవకాశాలు, కుటుంబంలో సంతోషం వంటి శుభ పరిణామాలు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి.

శుక్రుడి సంచారంతో వీరికి అదృష్టం! కెరీర్, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
Shukra Gochar 2026
Janardhan Veluru
|

Updated on: Nov 06, 2026 | 3:07 PM

Share

జ్యోతిషశాస్త్రంలో శుక్రుడిని సంపద, సుఖసంతోషాలు, విలాసాలు, ప్రేమ, ఐశ్వర్యానికి కారకుడిగా భావిస్తారు. నవంబర్ 6, 2026న శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశించి..నవంబర్ 22 వరకు అదే రాశిలో కొనసాగుతాడు. ఈ సుమారు 17 రోజుల శుక్ర సంచారం ఐదు రాశుల వారికి ప్రత్యేకంగా కలిసిరానుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశాలున్నాయి.

వృషభ రాశి:

శుక్రుడి సంచారం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశముంది. ప్రేమ సంబంధాల్లో కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే సూచనలు ఉన్నాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ సమయం సుఖసంతోషాలను తీసుకొస్తుంది. భూమి, ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కుతాయి. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి శుక్ర సంచారం పలు విషయాల్లో సానుకూల ఫలితాలను అందిస్తాయి. సోదరసోదరీమణుల నుంచి సహకారం లభిస్తుంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఉన్నత అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా ఈ సమయం అనుకూలంగా ఉండే అవకాశముంది. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతికి కొత్త అవకాశాలు వస్తాయి. స్నేహితులు, సహోద్యోగుల సహకారం లభిస్తుంది.

మకర రాశి

మకర రాశి వారికి శుక్ర సంచారం శుభ ఫలితాలను అందిస్తుంది. అదృష్టం తోడవడంతో చాలాకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ దక్కే అవకాశముంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

(గమనిక: ఇవి జ్యోతిషశాస్త్ర నమ్మకాలు, అంచనాల ఆధారంగా ఇచ్చిన వివరాలు మాత్రమే. వీటిని నిర్ధారిత ఫలితాలుగా భావించకూడదు)

Follow Us