Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారికి ఉత్సాహంగా ఆర్థిక వ్యవహారాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (June 10, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. హోదా, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి, అదనపు బాధ్యతల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి ఉత్సాహంగా ఆర్థిక వ్యవహారాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 10 June 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 10, 2025 | 5:31 AM

దిన ఫలాలు (జూన్ 10, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి, అదనపు బాధ్యతల నుంచి చాలావరకు విముక్తి లభించే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంది. సొంత పనులు, వ్యవహారాల మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఇతరులకు డబ్బు ఇచ్చి ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నం ఫలించవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. హోదా, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండకపోవచ్చు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. ఆదాయపరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభ వార్తలు వింటారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి, అదనపు బాధ్యతల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. ప్రయాణాల్లో లాభాలు కలుగుతాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. బాధ్యతలను, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని విధంగా రాబడి పెరుగుతుంది. కుటుంబపరంగా ఒకటి రెండు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. వ్యాపా రాలు నిలకడగా పురోగతి చెందుతాయి. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక లావాదేవీలకు, ఉచిత సహాయాలకు దూరంగా ఉండడం మంచిది. ఒకరిద్దరు బంధుమిత్రుల వల్ల నష్టపోయే సూచనలున్నాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. కొన్ని ఖర్చుల్ని తగ్గించుకుంటారు. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో మీ పని తీరు అధికారులకు బాగా నచ్చుతుంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగుల అదనపు రాబడి పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువుల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. సహచరుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. కుటుంబ విషయాల్లో తొందరపాటుతనం మంచిది కాదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా పురోగమిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతను నిరూపించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులు సవ్యంగా పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా, కుటుంబ బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తించగలుగుతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఆలోచించి ఖర్చులు చేయడం మంచిది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. అదనపు ఆర్థిక ప్రయత్నాలు కొద్దిగా మందగిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేసి అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో మిత్రుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లోనే కాక, ప్రయాణాల్లోనూ జాగ్రత్తగా ఉండడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. సమర్థతకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు ఫలించి అవసరాలు తీరుతాయి. ముఖ్యమైన పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభసాటి వాతావరణం ఉంటుంది. ఆస్తి వ్యవహారాల్లో లాభాలు పొందడానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రయాణాలు లాభిస్తాయి.