Telugu News Astrology June 2026 Astrology: These 6 zodiac signs may experience extraordinary success and fortune
June Astrology: ప్రధాన గ్రహాలు అనుకూలం.. జూన్‌లో వారికి పట్టిందల్లా బంగారం..!
June 2026 Horoscope: జూన్ నెలలో 5 ప్రధాన గ్రహాలు రాశులు మారడం జ్యోతిష్య శాస్త్రంపరంగా అత్యంత విశేషంగా భావిస్తున్నారు. బుధుడు, గురువు, శుక్రుడు, రవి, కుజుడు వరుసగా రాశి మారుతున్నారు. దీని ప్రభావంతో మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి శుభ యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాల్లో అనుకూల పరిణామాలు చోటుచేసుకునే ఛాన్స్ ఉంది. వీరికి కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ రాశులవారి జీవితాల్లో సానుకూల మార్పులు కనిపించే అవకాశం ఉంది.
జూన్ నెలలో ఏకంగా అయిదు గ్రహాలు రాశులు మారడం జరుగుతోంది. ఫలితంగా ఆరు రాశుల వారికి కొద్ది రోజుల తేడాతో క్రమంగా ఈ గ్రహాలు శుభ పలితాలను ఇవ్వబోతున్నాయి. మే నెల చివరి రోజున బుధుడు తన స్వక్షేత్రమైన మిథునంలోకి, జూన్ 2న గురువు తనకు ఉచ్ఛ క్షేత్రమైన కర్కాటకంలోకి, 9న శుక్రుడు కర్కాటకంలోకి, 16న రవి మిథున రాశిలోకి, 20న కుజుడు వృషభంలోకి మారడం జరుగుతోంది. దీనివల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారు అత్యధికంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ రాశులవారి జీవితాలు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోవడం జరుగుతుంది.
మేషం: అయిదు గ్రహాల అనుకూల సంచారం వల్ల జూన్ నుంచి ఈ రాశివారికి దశ తిరగడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు లభిస్తాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా విస్తరిస్తుంది. ఆదాయ వృద్ధికి చేసే ప్రయత్నాలన్నీ నూరు శాతం ఫలితాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.
మిథునం: ఈ రాశిలోనూ, ధన స్థానంలోనూ గ్రహ సంచారం పెరిగినందువల్ల ఈ రాశివారికి వచ్చే నెలంతా ఎక్కువగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మనసులోని ఒకటి రెండు కోరికలు, ఆశలు నెరవేరుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
కర్కాటకం: ఈ రాశిలో గురు, శుక్రుల సంచారంతో పాటు, లాభ స్థానంలో కుజుడి ప్రవేశం వల్ల ఈ రాశివారికి లక్ష్మీ కటాక్షం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కొద్ది ప్రయత్నంతో సంపన్నులయ్యే సూచనలున్నాయి. జూన్ నెలంతా షేర్లు తదితర ఆర్థిక లావాదేవీలు అదృష్టాన్ని పండిస్తాయి. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. శుక్ర, గురువుల అనుకూలత వల్ల వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.
కన్య: ఈ రాశికి దశమ, లాభ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతులకు బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. వీరికి అతి వేగంగా ఆదాయ వృద్ధి చోటు చేసుకుంటుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరగడం, ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడం, సొంత ఇల్లు అమరడం వంటివి జరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.
వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారి జీవితం తప్పకుండా ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో మరింత పైకి ఎదగడానికి అవకాశం ఉంది. ఉద్యోగపరంగా డిమాండ్ బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.
మకరం: ఈ రాశికి జూన్ నెలంతా అనేక పర్యాయాలు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఈ రాశికి సప్తమంలో గురువు ఉచ్ఛపడుతున్నందు వల్ల వీరి స్థితిగతులు, హోదా పెరుగుతాయి. ఆదాయ వృద్ధికి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని దాటుతాయి. రావలసిన డబ్బంతా చేతికి అందుతుంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. ఆశించిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)