AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారికి హ్యాపీగా వ్యక్తిగత జీవితం.. 12రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (September 17, 2025): మేష రాశి వారికి ఉద్యోగం బాగా అనుకూలంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. అధికారులు మీ మీద బాగా ఆధారపడతారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారికి హ్యాపీగా వ్యక్తిగత జీవితం.. 12రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 17 September 2025
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 17, 2025 | 5:31 AM

Share

దిన ఫలాలు (సెప్టెంబర్ 17, 2025): మేష రాశి వారికి ఉద్యోగం బాగా అనుకూలంగా, ఉత్సాహంగా సాగిపోయే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉండే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగం బాగా అనుకూలంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. అధికారులు మీ మీద బాగా ఆధారపడతారు. వ్యాపార కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి. పిల్లల చదువుల విషయంలో శుభ వార్తలు వింటారు. చేపట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు అనేక విధాలుగా సహాయపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనేక వ్యవహారాలను ఒకేసారి పూర్తి చేయాల్సి రావడం వల్ల కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేసుకుంటే మంచిది. ఇంటా బయటా కొద్దిగా వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్త అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వ్యక్తి గత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. అనుకున్న పనులు పూర్తవుతాయి. గృహ, వాహన సౌకర్యాల కోసం ప్లాన్ చేస్తారు. పెళ్లి సంబంధం విషయంలో బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడం మీద దృష్టి పెడతారు. సరికొత్త ఆలోచనలతో వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. నిరుద్యోగులకు ఊహించని విధంగా మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఉద్యోగంలో పురోగతి చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యక్తిగత జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. బంధువులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం యథావిధిగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. గట్టి ప్రయత్నంతో ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేస్తారు. బంధుమిత్రులు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ జీవితం కూడా ఆశాజనకంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ముఖ్యమైన వ్యక్తులతో సరికొత్త పరి చయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా అనుకోని అదృష్టం పడుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన రాబడి ఉంటుంది. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి. అనుకున్న పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ వృథా ఖర్చులు తప్పకపోవచ్చు. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతారు. ఉద్యోగంలో జీవిత భాగస్వామి శుభ వార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తీరిపో తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారాల్లో బాగా లాభాలు గడిస్తారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లాభాలు నిలకడగా ఉంటాయి. ఆదాయం బాగానే ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. పిల్లలు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో జీవిత భాగస్వామి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం కొనసాగుతాయి. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదం కూడా ఒక కొలిక్కి వస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. కొందరు బంధుమిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

Follow Us