Horoscope Today: దీపావళి అమావాస్య రోజున రాశి ఫలాలు.. అనారోగ్య సమస్యలు ..

|

Nov 04, 2021 | 6:45 AM

ఇప్పటికీ చాలా మంది తమ భవిష్యత్తు గురించి అంచనాలు వేసుకుంటూ ఉంటారు. తమ జీవితంలో జరగబోయేది ఘటనలను

Horoscope Today: దీపావళి అమావాస్య రోజున రాశి ఫలాలు.. అనారోగ్య సమస్యలు ..
Horoscope
Follow us on

ఇప్పటికీ చాలా మంది తమ భవిష్యత్తు గురించి అంచనాలు వేసుకుంటూ ఉంటారు. తమ జీవితంలో జరగబోయేది ఘటనలను ముందుగానే తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే.. తమకు ఎదురుకాబోయే పరిస్థితుల గురించి తెలుసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో రాశి ఫలాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక ఈరోజు దీపావళి అమావాస్య. మరి ఈరోజు మేష రాశి నుంచి మీన రాశి వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

మేష రాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు కలుగుతాయి. అలాగే ఆకస్మిక ప్రయణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం. ఉద్యోగం.. వ్యాపార రంగాల్లో స్థానచలనం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులలోనూ మార్పులు ఉంటాయి.. అలాగే కుటుంబసభ్యులు.. సన్నిహితుల సహకారం అంతు సులువుగా లభించదు.

వృషభ రాశి..
ఈరోజు వీరు నూతన వస్తువులు… ఆభరణాలు కొంటారు. అలాగే రుణాలు పొందుతారు. వినోదాలు.. శుభకార్యాలలో పాల్గోంటారు. శుభవార్తలు వింటారు .
మిథున రాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులను వాయిదా వేసుకుంటారు.. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలాగే అనుకోని ప్రయణాలు చేస్తారు. కుటుంబసభ్యులు.. సన్నిహితులతో విరోధాలు ఏర్పడతాయి.

కర్కాటక రాశి..
ఈరోజు వీరికి కుటుంబసభ్యులు.. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడతాయి. ఖర్చులు ఎక్కువవుతాయి. అనారోగ్య సమస్యలు కలుగుతాయి. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది.

సింహ రాశి..
ఈరోజు వీరు నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు.. రుణభాధలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది.

కన్య రాశి..
ఈరోజు వీరు శుభవార్తలు వింటారు.. కుటుంబంలో ఆనందంగా ఉంటారు.. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్తిక సమస్యలు తొలగిపోతాయి.

తుల రాశి..
ఈరోజు వీరికి స్నేహితులు.. కుటుంబసభ్యులతో కలహాలు ఏర్పడతాయి. ఖర్చులు ఎక్కువవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

వృశ్చిక రాశి..
ఈరోజు వీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.. ప్రతి విషయంలో జాగ్రత్తలు అవసరం. ఖర్చులు ఎక్కువవుతాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది.

ధనస్సు రాశి..
ఈరోజు వీరు దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ఆర్థికంగా మెరుగుపడతారు.. శుభవార్తలు వింటారు.

కుంభ రాశి..
ఈరోజు వీరి ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబసభ్యులు.. సన్నిహితులతో మంచిగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. నూతన వ్యక్తులతో స్నేహం చేసే సమయంలో అచి తుచి వ్యవహరించాలి.

మీనరాశి..
సంఘంలో గౌరవమర్యాధాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులతో సన్నిహితంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం .

Also Read: Balakrishna: బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ ఎంటర్‏టైన్‏మెంట్ షూరు.. ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Vijay Sethupathi: ఎయిర్‏పోర్ట్‏లో విజయ్ సేతుపతికి చేదు అనుభవం.. ఎగిరి తన్నిన యువకుడు..