Horoscope Today(20 June): ఆ రాశి వ్యాపారస్తులకు చేతినిండా డబ్బు.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు..
Rashi Phalalu(20 June): భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. దీన్ని తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంచుకుంటారు. ఈ రోజు ఏ రాశివారికి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయా? కుటుంబపరంగా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? 12 రాశుల వారి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
Rashi Phalalu(20 June): భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. దీన్ని తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంచుకుంటారు. ఈ రోజు ఏ రాశివారికి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయా? కుటుంబపరంగా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? 12 రాశుల వారి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): అన్ని విధాలుగాను సమయం అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది. అధికారులు ప్రోత్సాహకరంగా వ్యవహరిస్తారు. సహచరుల నుంచి సహకారం లభిస్తుంది. మొత్తం మీద ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు వారు మరింతగా ఎదగటానికి కృషి చేయవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయగలిగిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆదాయంలో ఆశించినంత పెరుగుదల లేనప్పటికీ ఖర్చుల భారం మాత్రం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అనుకోని ఖర్చులు అనవసర ఖర్చుల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగంలో పని భారం బాగా పెరిగే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో కొద్ది ప్రయత్నంతో అధిక లాభాలకు అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి వ్యాపారాల్లో కొత్త పుంతలు తొక్కుతారు. కొత్త నిర్ణయాలు, కొత్త పథకాలతో ముందుకు దూసుకుపోతారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం కూడా ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించవచ్చు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి పెద్దల జోక్యంతో సానుకూలంగా పరిష్కారం కావచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఇది చాలా అను కూలమైన సమయం. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ పరంగా ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలలో కొత్త పద్ధతులను అనుసరిం చాల్సిన అవసరం ఏర్పడుతుంది. తోబుట్టువు లతో ఒక వివాదం సామరస్యంగా పరిష్కారం అవుతుంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): కొత్త నిర్ణయాలను అమలు పరచడానికి కొత్త ప్రయత్నాలు ప్రారంభించడానికి ప్రస్తుత సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. బాకీలు వసూలు కావడం, అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలించడం వంటివి జరుగుతాయి. గృహ, వాహన సంబంధ మైన రుణ ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఈ రాశి వారికి రాశి నాధుడైన బుధుడు బలంగా ఉన్నందువల్ల అనేక ముఖ్యమైన కార్యక్రమాలు సునాయాసంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా పురోగతి ఉండటం, శుభవార్తలు వినడం, ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉండటం, మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరటం వంటివి జరగవచ్చు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు అవివాహితుల పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశి వారికి గురువు అనుగ్రహం పూర్తి స్థాయిలో ఉన్నందువల్ల ఉద్యోగపరంగా, కుటుంబపరంగా జీవితం సాఫీగా, సజావుగా సాగిపోవడానికి అవకాశం ఉంది. కొద్ది ప్రయ త్నంతో అత్యధికంగా సత్ఫలితాలను పొందే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సంపాదన బాగా తిరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. స్నేహితులకు అండగా నిలబడతారు.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): వృత్తి ఉద్యోగాలు సజావుగా ప్రశాంతంగా సాగి పోయే అవకాశం ఉంది కానీ కుటుంబంలో మాత్రం కొద్దిగా మనశ్శాంతి తగ్గే సూచనలు ఉన్నాయి. మాటలు, చేతలలో సంయమనం పాటించడం మంచిది. కోపతాపాలు, తొందర పాటు నిర్ణయాలు ప్రశాంతతను చెడగొట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. కుటుంబ సభ్యులలో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదు.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలి తాలను ఇస్తాయి. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన దాని కంటే ఎక్కువగా మెరుగుపడు తుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు స్నేహితుల సహాయంతో పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలలో పెద్దల తోడ్పాటు ఉంటుంది. ఉద్యోగంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. వృత్తి వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగు తుంది. బుధ, శుక్ర, శని గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, అవివాహితులకు పెళ్లి సంబంధం కుదరటం, ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం కావడం, పిల్లలు పురోగతి చెందటం వంటివి జరిగే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగ విషయాలలో సహచరుల నుంచి సహకారం అందుతుంది.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడి తగ్గటం, ప్రశాంత వాతావరణం ఏర్పడడం వంటివి జరుగుతాయి. వ్యక్తిగత జీవితంలో అనుకోకుండా మార్పులు చోటు చేసుకుంటాయి. జీవితం ఆశావహంగా కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. మనసులోని ఒకటి రెండు కోరికలు అప్రయత్నంగా నెరవేరుతాయి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగ జీవితంలో కొన్ని సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. బాధ్యతలు కూడా మార్పు జరగవచ్చు. ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. వృత్తి జీవితం సజావుగా సాగిపోతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడం జరుగుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.
ఇవి కూడా చదవండి
నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..