దిన ఫలాలు (సెప్టెంబర్ 9, 2024): మేష రాశి వారు ఈ రోజు చేపట్టిన పనులన్నీ అనుకూల రీతిలో పూర్తవుతాయి. దైవ సేవా కార్య క్రమాల్లో పాల్గొంటారు. వృషభ రాశి వారికి కొందరు మిత్రులతో విభేదాలకు అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. మిథున రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
అందరిలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది. దూరపు బంధువుల నుంచి ఆశించిన వర్తమానం అందుతుంది. చేపట్టిన పనులన్నీ అనుకూల రీతిలో పూర్తవుతాయి. దైవ సేవా కార్య క్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కొందరు మిత్రులతో విభేదాలకు అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ప్రయాణాలు సానుకూలంగా సాగిపోతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనుల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. వృత్తి జీవితంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయ త్నాలు ఉత్సాహం కలిగిస్తాయి. కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయి, ఊరట లభిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ముఖ్యమైన పనుల్లో కొన్ని మాత్రం పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల సమాధానం లభిస్తుంది. బంధుమిత్రులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. ఉద్యోగంలో అధికారుల నమ్మకం మరింతగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆర్థికంగా ఆశించిన అభివృద్ధి ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
కుటుంబసమేతంగా దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గట్టి పట్టుదలతో మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. కుటుంబంలో ఒత్తిళ్లు, ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంటా బయటా పరి స్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వృత్తి జీవితంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగు పడుతుంది. కొందరు సహచరుల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటుంది. కొందరు మిత్రుల నుంచి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కొద్ది వ్యయప్రయాసలతో పూర్తవుతాయి. వ్యాపారాలు ఆశించిన మేరకు రాణిస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారికి సమయం అనుకూలంగా ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఇంటా బయటా పనులు, బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరవుతారు. ఆధ్యాత్మిక వ్యవహారాల మీద ఖర్చు పెరుగుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ నిదానంగా పూర్తవు తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వ్యాపా రాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. వృత్తి జీవితంలో రాబడి పెరుగుతుంది. కొద్ది ప్రయ త్నంతో ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పరవా లేదు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కొన్ని నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. చిన్ననాటి మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. వ్యాపారాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో అందరికీ సహాయంగా ఉంటారు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించడానికి ప్లాన్ వేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి కొంత వరకు బయటపడడం జరుగుతుంది. నిరు ద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం కావచ్చు. ఆరోగ్య భంగం ఉండదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ధనపరంగా ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక లావా దేవీలకు దూరంగా ఉండడం చాలా మంచిది. చేపట్టిన పనులన్నీ సవ్యంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. సన్నిహితుల వల్ల లాభం పొందుతారు. నూతన ఉద్యోగ ప్రయ త్నాలకు ఆశించిన సమాధానం లభిస్తుంది. వ్యాపారాలు పరుగులు పెడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో రాబడి పెరుగుతుంది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెంచుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపో తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అంది వస్తాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. చేపట్టిన పనులన్నిటిలో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ధనపరంగా ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆస్తి వ్యవహారాల్లో బంధువుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపో వచ్చు. దైవ చింతన పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయ త్నాల మీద శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య, ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కార మవుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో సన్నిహిత సంబం ధాలు ఏర్పడతాయి. వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు.