
దిన ఫలాలు (ఆగస్టు 4, 2026): మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునేవారికి, నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు మాటలు రానివ్వవద్దు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి కానీ, కుటుంబ జీవితంలో కొద్దిగా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునేవారికి, నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఆదాయానికి, ఖర్చులకు పొంతన ఉండకపోవచ్చు. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు కొంత వరకూ సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఇబ్బందిపడతారు. విలువైన వస్తువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగా అనుకూలిస్తుంది.
ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు మాటలు రానివ్వవద్దు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో టెన్షన్లు, మానసిక ఒత్తిడి ఉండవచ్చు. ఉద్యోగం మారడానికి ప్రస్తుతానికి అవకాశం లేదు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వినే సూచనలున్నాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి కానీ, కుటుంబ జీవితంలో కొద్దిగా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించడం, జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఆదాయానికి లోటుం డదు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలు న్నాయి. బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. చిన్న వ్యాపారాలు బాగా పురోగమిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలమవుతాయి. బకాయిలు, బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా అది విజయవంతమవుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. మాటలు పడాల్సి వస్తుంది. వ్యాపారాల్లో కలిసి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తి నిపుణులకు డిమాండ్ పెరగడం, రాబడి బాగావృద్ధి చెందడం జరుగుతుంది.
ఉద్యోగ జీవితం అనుకూలంగా, సంతృప్తికరంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాలు విజయవంతంగా కొనసాగుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఒత్తిడికి గురవుతారు. శుభ పరిణామం ఒకటి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. పిల్లల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. శుభ కార్యాల మీద బాగా వ్యయం అవుతుంది. ఒకరిద్దరికి సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది.
ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారం కలిసి వస్తుంది. ఐ.టి నిపుణులకు ఉద్యోగం మారే అవకాశాలున్నాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచ నలున్నాయి. ఆదాయంలో మెరుగుదల కనిపిస్తోంది. కుటుంబంలో అపార్థాలు తలెత్తకుండా జాగ్రతపడాల్సి ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. శుభ కార్యాలు, దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆద్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యో గంలో గౌరవాభిమానాలకు లోటుండదు. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆరోగ్యం పరవాలేదు. ఇతరు లకు మేలు జరిగే పనులు చేస్తారు. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు.
ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు యథావిధిగా కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరు తాయి. ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలపై శ్రద్ధ పెంచడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది.
వృత్తి, ఉద్యోగాలపరంగా శుభ వార్తలు వినే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు, ఉద్యోగం మారే ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పిల్లలు వృద్ధిలోకి రావడం జరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొందరు స్నేహితులకు అండగా నిలబడతారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం పరవాలేదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగ, కుటుంబ విషయాలకు సంబంధించి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇతరులకు సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్త అందుతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. పిల్లల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. ఆదా యంతో సమానంగా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. కొందరు మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒకరిద్దరు బంధువులకు సహాయం చేయాల్సి వస్తుంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి.
సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇష్ట కార్యసిద్ధి, వ్యవహార జయం ఉంటాయి. శుభవార్తలు వినడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా వ్యాపారంలో పెట్టుబడులు పెంచడానికి ఆలోచించడం జరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది.
Disclaimer:ఈ కథనంలో పేర్కొన్న జ్యోతిష్య సమాచారం సాంప్రదాయ జ్యోతిష్య శాస్త్రంలోని విశ్వాసాలు, నిపుణుల ఆధారంగా అందించబడింది. ఇవి వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన అంశాలు మాత్రమే. ఫలితాలు వ్యక్తిగత జాతకం, దశలు, గ్రహస్థితులు, ఇతర అంశాలపై ఆధారపడి మారవచ్చు. ఈ సమాచారాన్ని శాస్త్రీయంగా నిర్ధారిత వాస్తవంగా లేదా ఖచ్చితమైన ఫలితాల హామీగా పరిగణించరాదు.