
దిన ఫలాలు (సెప్టెంబర్ 9, 2026): మేష రాశి వారికి ప్రస్తుతం సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆర్థికంగా మరింత పురోగతికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఈ రాశికి ప్రస్తుతం సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యంలో ఆశించిన స్థాయిలో మెరుగుదల ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండాలి. విలాసాలకు, వ్యసనాలకు అవకాశమివ్వవద్దు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం వృద్ధి ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలు కలుగుతాయి. వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది కానీ బంధువులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. వృత్తి జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాలు బాగా ప్రోత్సాహకరంగా పురోగమిస్తాయి.
ఆర్థికంగా మరింత పురోగతికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నా ముఖ్యమైన పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తవు తాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్ల రాబడి బాగా పెరుగుతుంది. ఐ.టి రంగంలోని వారికి సరికొత్త కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. కుటుంబ జీవితం చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
ఉద్యోగ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. అదనపు బాధ్యతలు లేదా లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, వైద్యం, పోలీస్ రంగాలకు చెందినవారికి సమయం అనుకూలంగా ఉంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యక్తిగత పనులు పూర్తవుతాయి. స్వయం ఉపాధి, వ్యాపారాల రంగంలోని వారు లాభాల బాట పడతారు. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబపరంగా ఒత్తిడి ఉండే అవకాశముంది.
ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. విదేశీయానానికి సంబంధించిన అవరోధాలు, ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యమైన పనుల్ని పట్టుదలగా పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు స్థిరంగా పురో గమిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాలు ఒడిదుడుకులు లేకుండా సాగి పోతాయి. వ్యాపారాల్లో యథావిధిగా లాభాలు కొనసాగుతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల ఇబ్బంది పడతారు. ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. ప్రస్తుతం ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో కలసి వస్తుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభ వార్త వింటారు. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు సఫలమవుతాయి. సర్వత్రా మాట చెల్లుబాట వువుతుంది. పలుకుబడి పెరుగుతుంది. కొత్త ఆదాయ ప్రయత్నాలు చేపట్టడానికి అవకాశం ఉంది. వ్యాపారంలో స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఊహించని ఖర్చులతో ఇబ్బందిపడతారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆహార, విహారాల్లోనే కాకుండా, ప్రయాణాల్లోనూ కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం అవసరం. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ఒత్తిడి ఉండవచ్చు. ఉద్యోగంలో అధికారులు లేదా సహచరుల నుంచి సహకారం ఉంటుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా పురోగమిస్తాయి. పట్టుద లగా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కొత్త ప్రయత్నాలు, నిర్ణయాల వల్ల ప్రయోజనం ఉంటుంది. సమయం అనుకూలంగా ఉంది. ఆదాయ వృద్ధికి కృషి చేయడం మంచిది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. అధికారుల ఒత్తిడి కూడా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులు, ఐటీ రంగానికి చెందినవారు, రియల్ఎస్టేట్, సేవా రంగాలకు సంబంధిం చినవారు బాగా పురోగతి చెందడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. వృథా ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు. వ్యాపారులకు సమయం అనుకూ లంగా ఉంది. కుటుంబ విషయాలకు సంబంధించి తొందరపడి ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవద్దు.
ఉద్యోగ జీవితం సజావుగా, సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు సాధారణ ఫలితాలని స్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పొదుపు సూత్రాలు పాటిస్తారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో, ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. ఉద్యోగం మార డానికి సమయం ఏమంత అనుకూలంగా లేదు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
ఉద్యోగపరంగా సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. శత్రు, రోగ, రుణ సమస్యలు బాగా తగ్గి ఉంటాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కొందరు బంధువుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆశించిన శుభవార్త అందుతుంది.