AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ 14 దిన ఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. ఉద్యోగంలో శుభవార్తలు!

Horoscope Today (September 14, 2026): సోమవారం 12 రాశుల వారికి గ్రహాల సంచారం ప్రభావంతో మిశ్రమ ఫలితాలు కనిపించనున్నాయి. మేష రాశి వారికి జీతభత్యాల పెరుగుదల, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసిరావచ్చు. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు వ్యక్తిగత సమస్యలు తగ్గే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి చాలాకాలంగా ఎదురవుతున్న సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు ఆకస్మిక ధనలాభం కలగవచ్చు. మిగిలిన రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారం తదితర అంశాల్లో దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

సెప్టెంబర్ 14 దిన ఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. ఉద్యోగంలో శుభవార్తలు!
Horoscope Today 14 September 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 14, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (సెప్టెంబర్ 14, 2026): మేష రాశి వారికి జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే సూచనలున్నాయి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. మిథున రాశి వారికి చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే సూచనలున్నాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. తొందరపాటు వ్యవహారాల వల్ల ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆకస్మిక విజయాలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపో తాయి. ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యక్తిగత పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో చిన్నపాటి సమస్యలున్నా అధిగమిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అదనపు ఆదాయ మార్గాల మీద దృష్టి పెడతారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగులు సకాలంలో బాధ్యతల్ని పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్య సిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. తమకు అంది వచ్చే అవకాశాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపడతారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో శుభ కార్యం తలపెడతారు. కొన్ని ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఇంటా బయటా బాధ్య తలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగాసాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభ కార్యం నిర్వహించడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వివాదాలు,అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచ యాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అవసరానికి సాయం అందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తీరిపోతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృథా ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగి పోతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో కార్యసిద్ధికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయి కొద్దిగా ఊరట చెందుతారు. శత్రువుల లేదా ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందజేస్తారు. తోబుట్టువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఇంటా బయటా గౌరవమర్యాదలు వృద్ధి చెందుతాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేస్తారు. కుటుంబపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక విషయాల్లో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. దగ్గర బంధు వుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోభివృద్ధి కలుగుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరు స్తాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంపొందు తాయి. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు అందుతాయి. మిత్రుల సహాయ సహకా రాలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఒక ప్రధానమైన రుణ సమస్య నుంచి బయట పడతారు. బరువు, బాధ్యతలు బాగా తగ్గుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ జీవితంలో కొన్ని బాధ్యతలు, లక్ష్యాల్ని సకాలంలో పూర్తి చేస్తారు. మీ సలహాలు, సూచన లను పాటించి అధికారులు లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభి స్తుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. బంధుమిత్రుల వల్ల ప్రయోజనం పొందుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. కొన్ని ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆర్థికంగా పైచేయిగా ఉంటారు. మధ్య మధ్య కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. కుటుంబంతో కొన్ని దైవ కార్యాల్లో పాల్గొంటారు.

Follow Us