AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ 13 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో శుభవార్తలు

సెప్టెంబర్ 13, 2026 ఆదివారం 12 రాశుల వారికి రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మేష రాశి వారికి వ్యాపారం, ఆదాయం పరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి ఉద్యోగులకు స్థానచలనంతో కూడిన ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి వారికి వ్యక్తిగత సమస్యలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. మరి మేషం నుంచి మీనం వరకు మిగిలిన రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక, కుటుంబ విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం.

సెప్టెంబర్ 13 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో శుభవార్తలు
Horoscope Today 13 September 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 13, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (సెప్టెంబర్ 13, 2026): మేష రాశి వారికి వ్యాపారంలో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు స్థానచలనంతో కూడిన ప్రమోషన్ రావచ్చు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. మిథున రాశి వారికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. చేపట్టిన ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. సన్నిహితుల నుంచి అవసర సమయాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధువులతో శుభకార్యంలో పాల్గొంటారు. ఒకటి రెండు మొండి బాకీలను పట్టుదలగా వసూలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగులకు స్థాన చలనంతో కూడిన ప్రమోషన్ రావచ్చు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యో గావకాశాలు అంది వస్తాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపారాల్లో స్థిరమైన ఆలోచనలతో పురోగమిస్తారు. వృత్తి జీవితంలో సరికొత్త వ్యూహాలను అను సరిస్తారు. చేపట్టిన పనులు ఎటువంటి అవరోధాలూ లేకుండా సకాలంలో పూర్తవుతాయి. తోబుట్టువులతో వివాదాలు చాలావరకు సమసిపోతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి తగ్గి, సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామికి ఆశించిన శుభవార్త అందుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగులు సకాలంలో బాధ్యతలను, లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న కొన్ని వ్యవహారాలను మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని అమల్లో పెడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా, సానుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యా లను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుటుంబ వ్యవహా రాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసు కోవద్దు. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మీ సల హాలు, సూచనల వల్ల బంధుమిత్రులు లబ్ధి పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల అభిప్రాయాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచిది. మిత్రుల్ని నమ్మి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా పురోగమిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా పురోగతి చెందుతారు. ఇష్టమైన మిత్రులతో విందులో పాల్గొనే అవకాశం ఉంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగులు అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. పని భారం వల్ల విశ్రాంతి తగ్గుతుంది. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆర్థిక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయ మార్గాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు చాలావరకు పూర్తవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇతరులకు డబ్బు ఇవ్వడం కానీ, డబ్బు తీసుకోవడం గానీ చేయవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించి, తగిన ప్రతిఫలం పొందుతారు. వృత్తి రంగంలో ఉన్నవారికి మంచి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో భాగస్థులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా, ఆశాజనకంగా సాగు తాయి. బంధు వర్గంతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలుం టాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగు తుంది. ఆర్థిక అనుకూలతలు కలుగుతాయి. సన్నిహితుల నుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ వృద్ధికి కొత్త ప్రయత్నాలు చేపడతారు. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. అవసరానికి డబ్బు అందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

పని తీరుతో అధికారుల్ని, సహచరుల్ని ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఆస్తిపాస్తులకు సంబంధించిన డబ్బు చేతికి అందుతుంది. సమాజంలో ఉన్నత వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మరింత ఉత్సాహంతో పనిచేసి లాభాలు అందుకుంటారు. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికార లాభంతో పాటు ఆదాయ లాభం కూడా కలిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఉన్నవారికి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ, వాహన ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగుతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. పరి చయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.

Disclaimer: ఈ రాశిఫలాలు జ్యోతిషశాస్త్రం, గ్రహాల సంచారం ఆధారంగా రూపొందించబడిన సాధారణ అంచనాలు మాత్రమే. వీటిని విశ్వాసాలు, సంప్రదాయాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత జాతకం, గ్రహస్థితులు, దశలు తదితర అంశాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు.

Follow Us