సెప్టెంబర్ 10 రాశిఫలాలు: వారికి ఉద్యోగ పదోన్నతి.. ఆదాయం పెరిగే ఛాన్స్

Horoscope Today (September 10, 2026): గురువారం మేష రాశి ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు కనిపిస్తుండగా, వృషభ రాశి వారికి బాధ్యతలు పెరిగినా ఆర్థికంగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. మిథున రాశి వారికి ఉద్యోగ సమస్యలు తగ్గడంతో పాటు వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరిగే సూచనలు ఉన్నాయి. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి గురువారంనాటి దిన ఫలాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

సెప్టెంబర్ 10 రాశిఫలాలు: వారికి ఉద్యోగ పదోన్నతి.. ఆదాయం పెరిగే ఛాన్స్
Horoscope

Edited By:

Updated on: Sep 10, 2026 | 6:43 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 10, 2026): మేష రాశికి చెందిన ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేసి ఆశించిన లబ్ధిపొందుతారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో కొద్దిగా బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు. మిథున రాశికి చెందిన వారికి ఉద్యోగ జీవితంలో చిన్నా చితకా సమస్యలు చాలావరకు తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేసి ఆశించిన లబ్ధిపొందుతారు. దాదాపు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఆస్తి సంబంధమైన వ్యవహారాలలో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ, వాహన ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో కొద్దిగా బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు కానీ, కొందరు సన్నిహితుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితం అన్ని విధాలా సాఫీగా సాగుతుంది. ఆస్తి వివాదాల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ జీవితంలో చిన్నా చితకా సమస్యలు చాలావరకు తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, కొందరు పోటీదార్ల వల్ల ఇబ్బందులున్నాయి. ఏ రంగంలో ఉన్న ప్పటికీ ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మీద కోపతాపాలు ప్రదర్శించకపోవడం మంచిది. నిరుద్యోగులకు బాగా కలిసి వచ్చే కాలం ఇది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారులు, సహచరులతో అనుకూలతలు పెరుగుతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో చిన్నా చితకా సమస్యలున్నప్పటికీ, కార్యకలా పాలు ముందుకు వెడతాయి. ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. పిల్లలు చదువుల్లో పురో గతి సాధిస్తారు. తలపెట్టిన వ్యక్తిగత పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబానికి అవసరమైన వస్తు పరికరాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో ప్రోత్సాహం, ఆదరణ ఆశించిన స్థాయిలో కొనసాగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యత కనిపిస్తుంది. కొందరు స్నేహితులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. గృహ, వాహన సంబంధమైన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యో గులకు ఆశించిన సమాచారం అందవచ్చు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి కెరీర్ కి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో పోటీ ఎక్కువగానే ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ఉద్యో గంలో పనిభారం ఉంటుంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగంలో బాధ్యతల మార్పులకు కూడా అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదాలు రానివ్వకపోవడం మంచిది. నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగంతో కొద్ది కాలం సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పిల్లలకు బాగుంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా కూడా రోజంతా చాలా వరకు సానుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగు తాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజ నకంగానే ఉంటుంది. విలాసాల మీద బాగా ఖర్చయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితంలో అదనపు బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో బాగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా అందుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవు తాయి. తోబుట్టువుల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉత్సాహాన్నిచ్చే కబురు అందు తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితం బిజీగా మారుతుంది. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. తలపెట్టిన కార్యక్రమాలు, వ్యవహారాల్లో కార్య సిద్ధి ఉంటుంది. కుటుంబ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రయాణాల్ని వాయిదా వేయడం మంచిది. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన అవకాశాలు అందుతాయి. వ్యాపారాల్లో కొత్త వ్యూహాల్ని ఆచరణలో పెట్టి లాభాలు గడిస్తారు. ఇంటా బయటా కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. తలపెట్టిన పనులు, వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సన్నిహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కూడా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో నూతనోత్సాహంతో పురోగమిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి యథాతథంగా కొనసాగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులు, తోబుట్టువులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతారు. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

శ్రమాధిక్యత ఉన్నా వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు సక్రమంగా, సకాలంలో నిర్వర్తిస్తారు. వ్యాపారంలో కొత్త ఆలో చనలు ప్రవేశపెడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు, రాబడి ప్రయత్నాలకు అవకాశాలు బాగానే ఉంటాయి. కానీ, మిత్రుల వల్ల పక్కదోవ పట్టాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us