
దిన ఫలాలు (జూలై 30, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువగా లాభాలు గడిస్తారు. వృషభ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబపరంగా కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. మిథున రాశి వారికి కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువగా లాభాలు గడిస్తారు. సోదర వర్గంతో వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని కీలక వ్యవహారాలు పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. జీవిత భాగస్వామి వ్యక్తిగత జీవితంలో పురోగతి ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబపరంగా కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. ఇంట్లో ఒకరికి అనారోగ్యం చేసే అవ కాశం ఉంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.
వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉద్యోగులకు అధికార వర్గాల నుంచి ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరు గుతాయి. నిరుద్యోగులకే కాకుండా, ఉద్యోగులకు కూడా కొత్త అవకాశాలు, ఆఫర్లు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సానుకూలపడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
ఉద్యోగంలో హోదా పెరగడానికి బాగా అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, వృత్తి నిపుణులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో పురోగమిస్తాయి. తలపెట్టిన ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
ఆర్థిక ప్రయత్నాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగ మిస్తాయి. ముఖ్యమైన పనుల మీద శ్రద్ధ పెట్టి పూర్తి చేసుకోవడం మంచిది. ఉద్యోగులకు కొద్దిగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. సహోద్యోగుల బాధ్యతలను కూడా పంచుకోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పిల్లల విజయాల గురించి శుభవార్తలు వింటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాములతో సామరస్యం ఏర్ప డుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన లాభాలనిస్తాయి. శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ పట్టుదలగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను, పనులను పూర్తి చేస్తారు. వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండకపోవచ్చు.
ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తలపెట్టిన పనులు సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యానికి భంగం ఉండదు.
వృత్తి, ఉద్యోగాలలో కొత్త ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాల్లో ఉత్తమ ఫలి తాలు సాధిస్తారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను ఎంతో శ్రమ మీద పూర్తి చేసి, తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. బంధువుల సహాయ సహకారాలతో ఆస్తి వివాదం ఒకటి సానుకూ లంగా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది.
ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. కుటుంబం విషయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉపయోగకరమైన పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరో గ్యం విషయంలో అశ్రద్ధ పనికి రాదు. అదనపు ఆదాయం కోసం బాగా శ్రమ పడడం జరుగుతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సహోద్యోగుల సహాయ సహ కారాలుంటాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో అపార్థాలు తలెత్తే సూచన లున్నాయి. మాట తొందర పనికి రాదు. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ముఖ్యమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. ఆలయాల్ని సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.
ఉద్యోగులు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేతికి వస్తాయి. ఐటి వంటి వృత్తి నిపుణులకు తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి, ఆశిం చిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. పిల్లల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.
వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి, విశ్రాంతి తగ్గే సూచనలున్నాయి. ఆదాయానికి మించి ఖర్చు లుంటాయి. కొందరు మిత్రులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో ముఖ్య మైన పనులు పూర్తి చేస్తారు. ఇంటి విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలలో ఆశించిన స్పందన లభిస్తుంది.
Also Read: ఆగస్టు మాసంలో వీరి జాతకం మారబోతోంది..! అదృష్ట రాశులివే..
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న రాశి ఫలితాలు సంప్రదాయ జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ఆధారంగా అందించబడినవి మాత్రమే. ఇవి శాస్త్రీయంగా నిర్ధారించబడిన అంశాలు కావు. వీటిని కేవలం సాధారణ సమాచారం, ఆధ్యాత్మిక ఆసక్తి కోసం మాత్రమే పరిగణించాలి. వ్యక్తిగత జీవిత నిర్ణయాలు, ఆర్థిక, వైద్య, విద్య, ఉద్యోగ లేదా ఇతర కీలక విషయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.