
దిన ఫలాలు (జూలై 10, 2026): మేష రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగుతుంది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు పదోన్నతులు అందుతాయి. వృత్తి జీవితంలో బాగా ఒత్తిడి ఉంటుంది. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
సహోద్యోగుల సహాయంతో ఉద్యోగులు కొన్ని భారీ లక్ష్యాలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగుతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి.
ఉద్యోగులకు పదోన్నతులు అందుతాయి. వృత్తి జీవితంలో బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ పెద్దలు అనారోగ్యం నుంచి కోలుకుంటారు. నిరుద్యోగుల ప్రయ త్నాలు సఫలమవుతాయి. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి సారిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచన లున్నాయి. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగంలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో విశేషమైన లాభాలు ఆర్జిస్తారు. కొందరు బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.
వృత్తి, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి శుభవార్తలు అందు తాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ఆచర ణలో పెట్టి లాభాలు గడిస్తారు. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయదగ్గ స్థాయిలో ఉంటుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన పనుల న్నిటినీ త్వరగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఉద్యోగంలో బాధ్యతలు మారడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురో గతి చెందుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వా మితో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. చిన్న నాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. ప్రయాణాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. జీవిత భాగ స్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
వృత్తి, ఉద్యోగాల్లో నూతనోత్సాహంతో పురోగమిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా అనుకున్న సమయానికి అన్నీ పూర్తవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శి స్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభి స్తుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగు తాయి. ఇంటా బయటా అనుకూలతలుంటాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఆస్తి వ్యవహారాలలో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులు శుభ వార్త వింటారు.
ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురో గతి చెందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలున్నా అధిగమిస్తారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కొందరు మిత్రులు ఇబ్బందులకు గురి చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం అన్ని విధాలా సామరస్యంగా ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగు తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. బంధువులతో మాట పట్టింపులు తలెత్తే సూచనలున్నాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల కలహాలలో మధ్యవర్తిత్వం చేస్తారు. ఏ రంగంలో ఉన్నా ఆదాయానికి లోటుండదు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం ఇది.
ఉద్యోగంలో అధికారుల నుంచే కాక, సహోద్యోగుల నుంచి కూడా ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని చిన్నా చితకా సమస్యలున్నా, కార్యకలాపాలు కొనసాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు. ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది.
ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కు తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. దైవచింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు పీడిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు, రాబడి వృద్ధికి అవకాశాలు బాగానే ఉంటాయి.
ఉద్యోగంలో ప్రోత్సాహం, ఆదరణ కొనసాగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. రుణ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభ వార్త అందవచ్చు.
Also Read: శని వక్ర గమనం.. త్వరలో ఈ రాశులకు గోల్డెన్ డేస్.. మీ జాతకం మారుతోంది భయ్యా..!