
దిన ఫలాలు (ఆగస్టు 2, 2026): మేష రాశి వారికి వ్యాపారాలు బాగా ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు బాగా ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనుకోకుండా కొందరు చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
ఉద్యోగంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని చాలావ రకు చక్కబెడతారు. ఇంటి పనులు, బయట పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు తొలగిపోతాయి. ముఖ్య మైన పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన పనులు నిదా నంగా పూర్తవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రుల్లో కొందరిని ఆర్థికంగా ఆదుకుంటారు. గృహ నిర్మాణ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం పరవాలేదు.
సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా శుభ వార్తలు వింటారు. మంచి ఉద్యో గంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఒకటి రెండు ఆశించిన శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి స్వల్ప ప్రయత్నంతో బయటపడతారు. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. బంధువుల రాకపోకలుంటాయి. మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్త అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల తలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారికి డిమాండ్ పెరుగు తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా షాపింగ్ చేస్తారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి.
ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, ఖర్చుల్ని బాగా తగ్గించడం మంచిది. అదనపు ఆదాయ మార్గాల మీద శ్రమ పడడం ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. కుటుంబ పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో కొన్ని స్థిరమైన నిర్ణ యాలు తీసుకుంటారు. వృత్తి జీవితంలో కొద్దిగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు.
ఆర్థిక వ్యవహారాలు ఆశించిన సత్ఫలితాలనిస్తాయి. తోబుట్టువులకు ఆర్థికంగా అండగా నిలబడ తారు. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి జీవితం చాలావరకు ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపోతుంది. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి.
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరాభిమానాలు లభిస్తాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగు తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా ఖర్చులు పెరిగినప్పటికీ ఇబ్బంది ఉండదు. ఆర్థిక సమ స్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబం మీద బాగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యాపారంలో కొద్దిగా మార్పులు చేసి లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికర స్థాయిలో ఉంటుంది. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. తలపెట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పిల్లలు చదువుల మీద మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.
ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. పెండింగ్ పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగ స్వామి సలహాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆదా యం పెరిగే అవకాశం ఉంది కానీ, ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగ జీవితంలో పని భారం బాగా పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. బాగా దగ్గర బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. సమయస్ఫూర్తితో వ్యవహ రించి వ్యక్తిగత సమస్యల్ని చాలావరకు పరిష్కరించుకుంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ జీవితం సామరస్యంగా, అన్యోన్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
Also Read: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ యోగం.. 12 రాశులకు వారఫలాలు
(గమనిక: ఈ కథనంలో పొందుపరిచిన రాశిఫలాలు పంచాంగం, గ్రహస్థితులు, సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా అందించబడినవి. ఇవి సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. వ్యక్తిగత జీవితంలో తీసుకునే ఆర్థిక, వైద్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లేదా ఇతర కీలక నిర్ణయాలకు వీటిని ఏకైక ఆధారంగా పరిగణించరాదు)