శుక్ర, గురు గ్రహాల అనుగ్రహం.. ఈ రాశుల వారికి దాంపత్య జీవితం సుఖమయం..

అక్టోబర్ చివరి వరకు శుక్రుడు, గురు గ్రహ సంచారం అనుకూలంగా ఉండటంతో కొన్ని రాశుల వారికి దాంపత్య జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తొలగి, కుటుంబంలో సుఖసంతోషాలు పెరిగే సూచనలు ఉన్న రాశులు ఏవో తెలుసుకుందాం.

శుక్ర, గురు గ్రహాల అనుగ్రహం.. ఈ రాశుల వారికి దాంపత్య జీవితం సుఖమయం..
Happy Married Life

Edited By:

Updated on: Aug 25, 2026 | 1:47 PM

మున్ముందు తమ దాంపత్య జీవితం సానుకూలంగా సాగిపోతుందా? జీవిత భాగస్వామితో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? విభేదాలు, వివాదాలు పరిష్కారమవుతాయా? ఇందుకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా? జాతక చక్రంలోనూ, గ్రహ సంచారంలోనూ శుక్రుడితో పాటు ఇతర శుభ గ్రహాల స్థితిగతులను బట్టి, కుటుంబ జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. అక్టోబర్ చివరి వరకు శుక్ర గ్రహ సంచారం, గురు గ్రహ సంచారం అనుకూలంగా ఉండబోతున్నందువల్ల మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశులకు దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి, సుఖ సంతోషాలతో సాగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

  1. మేషం: జీవిత భాగస్వామికి కారకుడైన శుక్ర గ్రహంతో పాటు ఈ రాశికి గురు బలం కూడా తోడవు తున్నందువల్ల ఈ రాశివారి కుటుంబ, దాంపత్య జీవితం సాఫీగా సాగిపోయే అవకాశం ఉంది. పెద్దల జోక్యంతో కుటుంబ జీవితంలో సమస్యలు, అపార్థాలు పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంది. ఈ నెలాఖరు వరకు దంపతుల మధ్య కొద్దిగా చిటపటలు ఉండే అవకాశం ఉన్నా, క్రమంగా ఆ పరిస్థితిలో మార్పు వస్తుంది. జీవిత భాగస్వామితో కోర్టు వివాదాలు సద్దుమణుగుతాయి.
  2. వృషభం: రాశ్యధిపతి శుక్రుడే కళత్ర కారకుడైనందువల్ల, ఉచ్ఛస్థితిలో ఉన్న గురువు సప్తమ స్థానాన్ని చూస్తున్నందువల్ల ఈ రాశివారి వైవాహిక జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. ఎటువంటి సమస్యలున్నా కొద్ది ప్రయత్నంతో తొలగిపోతాయి. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోవడానికి అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి, సొంత ఇల్లు ఏర్పడడానికి, సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. వివాదాలు, విభేదాలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది.
  3. కర్కాటకం: కళత్ర కారకుడైన శుక్రుడు సెప్టెంబర్ మొదటి వారంలో స్వస్థానమైన తులా రాశిలో ప్రవేశిస్తున్నం దువల్ల ఈ రాశివారి కుటుంబ, దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా సమసిపోతాయి. ముఖ్యంగా దాంపత్య జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. భార్యాభర్తలు తమ సమస్య లను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవడం జరుగుతుంది. జీతభత్యాలు పెరగడం, ఆదాయం వృద్ధి చెందడం, సంతాన ప్రాప్తికి అవకాశం ఉండడం వల్ల ఇద్దరి మధ్యా అన్యోన్యత పెరుగుతుంది.
  4. కన్య: గురు, శుక్రులు అక్టోబర్ చివరి వరకు ఈ రాశికి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల దంపతుల మధ్య అన్యోన్యత బాగా పెరిగే అవకాశం ఉంది. కోర్టు కేసుల నుంచి బయటపడడం జరుగుతుంది. పెద్దల జోక్యంతో, బంధువుల మధ్యవర్తిత్వంలో ఇద్దరి మధ్యా మళ్లీ బంధం పటిష్ఠం అవుతుంది. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ముందుకు సాగిపోతుంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనే అవకాశం కూడా ఉంది. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం కనిపిస్తోంది.
  5. తుల: ఈ రాశికి అక్టోబర్ చివరి వరకు శుక్ర గ్రహం బాగా అనుకూలంగా ఉంది. సప్తమ స్థానాధిపతి బుధ గ్రహం కూడా అనుకూల సంచారం చేస్తున్నందు వల్ల, భార్యాభర్తల మధ్య ఎటువంటి పొరపచ్చాలున్నా సమసిపోయే అవకాశం ఉంది. ఆర్థిక, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. కొన్ని కీలక శుభ పరిణామాల వల్ల దంపతుల మధ్య సంతోషకరమైన వాతావ రణం నెలకొంటుంది. ఆదాయం వృద్ధి చెందడం, సొంత ఇల్లు, వాహనాలు ఏర్పడడం జరుగుతాయి.
  6. మకరం: ఈ రాశికి శుక్ర గ్రహ సంచారంతో పాటు సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛస్థితిలో ఉండడం వల్ల కుటుంబ, దాంపత్య జీవితాలు సుఖ సంతోషాలతో సాగిపోయే అవకాశం ఉంది. ఈగో సమస్యలు, అపార్థాలు క్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. భార్యాభర్తల మనసుల్లోని కోరికలు, ఆశలు చాలా వరకు నెరవేరుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఇష్టమైన విహార యాత్ర చేసే అవకాశముంది. దాంపత్య జీవితం అనేక విధాలుగా కొత్త పుంతలు తొక్కుతుంది.
Loading...
Unable to load recommendations.
Follow Us