Breaking News
  • ఆల్ టైమ్ రికార్డ్సు స`ష్టిస్తున్న గోల్డ్ , సిల్వర్ . 10 గ్రాముల బంగారం రూ 58,330 . కేజీ వెండి రూ 78,300. ఈ వారంలోనే మూడు సార్లు పెరిగిన బంగారం ధర . ప్రతిసారీ 8వందల నుంచి వేయి పెరిగిన గోల్డు. 65 వేలకు చేరుకుంటుందంటున్న మార్కెట్ అంచనాలు.
  • ప్రముఖ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తి అరెస్ట్.. పిడుగురాళ్ల మండలం చెందిన వందనపు నాగారాజు ఈ నెల 2వ తారీఖున క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ ముంబైలో కేసు నమోదు. ఐపీ అడ్రస్ పిడుగురాళ్ల గా గుర్తింపు. పోస్ట్ పెట్టిన వ్యక్తి ని అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు.
  • టీవీ9 తో ఎ పి జైళ్ల శాఖ ఐ జి జయవర్ధన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లలో ఉన్న ఖైదీలకు కరోనా టెస్టులు చేయిస్తున్నాం. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 420 మంది ఖైదీలకు, 60 మంది స్టాఫ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న ఒక్కరోజే రాజమండ్రి సెంట్రల్ జైలు లో 245 మందికి పాజిటివ్ వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైల్ లోనే ఐసోలేషన్ సెంటర్ ని ఏర్పాటు చేశాం. పాజిటివ్ వచ్చినవాళ్ళల్లో ఎక్కువశాతం మైల్డ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లకు అప్రమత్తత చేశాం. ఐసోలేషన్ సెంటర్ నుంచి ఖైదీల పారిపోవడానికి ప్రయత్నిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి. ఖైదీలకు నాణ్యమైన ఆహారాన్ని వైద్య సౌకర్యాన్ని అందిస్తూ డాక్టర్ల పర్యవేక్షణ చేస్తున్నాం. పాజిటివ్ వచ్చిన ఖైదీల వివరాలు కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నాము. ఖైదీల కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
  • అనంతపురం కన్సెప్ట్ సిటీ కన్సల్టెంట్ గా CBRE సౌత్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ . భవిష్యత్ వ్యాపార అవసరాల కోసం రాష్ట్రం లో 3 కాన్సెప్ట్ సిటీలు ప్లాన్ చేసిన సర్కార్ . అనంతపురం కాన్సెప్ట్ సిటీకి కాన్సెప్టువల్ ప్లాన్, ఫీజబిలిటి రిపోర్ట్, బిజినెస్ స్ట్రాటజీ, ఫైనాన్సియల్ మోడల్ ప్రణాళిక సిద్దం చేసి అమలు చేయనున్న CBRE. ఇందుకోసం దాదాపు 85 లక్షల రూపాయలకు పరిపాలన అనుమతులు మంజూరు.
  • తమిళనాడు లో ఘోర రోడ్డు ప్రమాదం. కోయిఅంబత్తూర్ లోని ఆనకట్ట రహదారిలో చెట్టుని డీ కొట్టిన కారు . కారులో ప్రయాణిస్తున్న యువకులలో నలుగురు మృతి , ఒకరి పరిస్థితి విషమం . కారు అతివేగం గా నడపడం ప్రమాదానికి కారణం . ఫ్రెండ్స్ పుట్టినరోజు వేడుకలు వెళ్లివస్తుండగా జరిగిన ఘటన.
  • దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 8.87శాతం, రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 8.56శాతం, కర్ణాటకలో 9.88శాతం, తమిళనాడులో 9.26శాతం, మహారాష్ట్రలో 19.36శాతం, ఢిల్లీలో 12.75శాతం. మరణాల రేటు దేశంలో 2.07శాతం, ఏపీలో 0.89శాతం. కర్ణాటకలో 1.85శాతం, కర్ణాటకలో 1.85శాతం, తమిళనాడులో 1.63శాతం, మహారాష్ట్రలో 3.52శాతం. ప్రతి పదిలక్షల మందిలో 43,059 మందికి పరీక్షలు. శ్రీకాకుళం, కర్నూలు, కడప, కృష్ణా, నెల్లూరు, పశ్చిమగోదావరి, చిత్తూరులో రాష్ట్రం సగటుకన్నా ఎక్కువ పరీక్షలు.
  • ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టైన ఏపీ సచివాలయ ఉద్యోగి మురళీ మోహన్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం . గత నెల 10 తేదీన సచివాలయంలో మురళీ మోహన్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ. కార్మిక శాఖ మాజీ మంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన కాలంలో ఈఎస్ఐ కుంభకోణంలో మురళీ పాత్ర ఉందని ఏసీబీ అభియోగం. అరెస్టైన నాటి నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఆదేశాలు. ప్రస్తుతం పట్టణాభివృద్ధి శాఖలో సెక్షన్ ఆఫీసరుగా విధులు నిర్వహిస్తోన్న మురళీ మోహన్.
  • భూముల విలువలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల సందడి . భుాముల విలువ పె౦పు అమలులోకి వస్తే భార౦ పడుతుందని ము౦దుగానే రిజిస్ట్రేషన్ లు వెలుతోన్న జిల్లా వాసులు.

‘అర్జున్‌ సురవరం’ మూవీ రివ్యూ..నిఖిల్ హిట్ బొమ్మతో వచ్చాడు

Arjun Suravaram Telugu Movie Review And Rating, ‘అర్జున్‌ సురవరం’ మూవీ రివ్యూ..నిఖిల్ హిట్ బొమ్మతో వచ్చాడు

టైటిల్‌: అర్జున్‌ సురవరం
నటీనటులు: నిఖిల్‌, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళీ, సత్య…
దర్శకత్వం: టీఎన్‌ సంతోష్‌
సంగీతం: సామ్‌ సీ.ఎస్‌
సమర్పణ: ‘ఠాగూర్‌’ మధు
నిర్మాత: రాజ్‌కుమార్‌ ఆకెళ్ల

ఇంట్రో:

‘హ్యాపీడేస్’ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన నిఖిల్, రోజురోజుకు తన స్థాయిని పెంచుకుంటూ హీరోగా రాణిస్తున్నాడు. ఇటీవల ఎంచుకున్న స్క్రిప్ట్‌లు నిఖిల్‌కు సపరేట్ మార్కెట్‌ని తెచ్చిపెట్టాయి. మనోడి సినిమా వస్తుందంటే చూసేందుకు ఆడియెన్స్ థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు. తాజాగా ‘అర్జున్‌ సురవరం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. తమిళ సూపర్‌హిట్‌ చిత్రం ‘కణితన్‌’కు  రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. వాస్తవానికి చాలా నెలల క్రితమే మూవీ  రిలీజ్‌ కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి రావడంతో సినిమాకి ఒక్కసారిగా బజ్ పెరిగిపోయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:

అర్జున్ లెనిన్ సురవరం( నిఖిల్ ) జర్నలిజంపై మక్కువతో..సాప్ట్‌వేర్ జాబ్ వదిలేసి.. టీవీ99 అనే ఛానల్‌లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా జాయిన్ అవుతాడు. ఎప్పటికైనా బీబీసీలో పనిచెయ్యాలన్నది అతని డ్రీమ్. ఒక స్ట్రింగ్ ఆపరేషన్  మధ్యల  అర్జున్‌కి కావ్య(లావణ్య త్రిపాఠి) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతోంది.  తాను బీబీసీలో పనిచేస్తున్నాని చెప్పి అబద్దం చెప్పడంతో..కావ్య హర్ట్ అయ్యి అర్జున్ దూరం పెడుతుంది. కానీ అతనపై ఉన్న సాప్ట్ కార్నర్ వల్ల ..బీబీసీకి అర్జున్ రెజ్యూమ్‌ని కావ్యనే పంపుతుంది. అలా  బీబీసీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గాా అర్జున్ జాబ్ సంపాదిస్తాడు. మళ్లీ లవ్ ట్రాక్ ఎక్కుతోన్న సమయంలో ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో పాటు ఎడ్యుకేషన్‌ లోన్స్‌ పేరిట బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో స్కామ్ చేశాడన్న అభియోగాలతో అర్జున్‌ని అరెస్ట్ చేస్తారు. అతనితో చాలా మంది ఈ స్కామ్‌లో ఇరుక్కుంటారు. అభియోగాల వల్ల అందులో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. అదే సమయంలో నిఖిల్ బెయిల్‌పై బయటకు వస్తాడు. అసలు ఈ నకిలీ సరిఫికేట్స్ వ్యవహారం ఏంటి? దానితో అర్జున్‌కి ఏంటి సంబంధం? దానివెనుక ఉన్నది ఎవరు? అర్జున్ వాళ్ళను పట్టుకోగలిగాడా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: 

కనితన్‌కి రీమేక్‌గా తెరకెక్కించినా తెలుగులో చాలా మార్పులు చేశారు. సినిమా రిలీజ్ చాలా ఆలస్యమైనా, హిట్ మోత మాత్రం సాలిడ్‌గా వినిపిస్తోంది. ఫేక్‌ సర్టిఫికెట్స్‌ వల్ల జరిగే అనర్థాలను ఈ చిత్రంలో చక్కగా చూపించగలిగారు. ఫస్టాప్ అంతా అదిరిపోయే ట్విస్టులతో, ఉత్కంఠగా సాగే స్క్రీన్ ప్లేతో ఆద్యంతం అలరిస్తుంది. సెకండాఫ్ కాస్త స్లో అనిపిస్తుంది. వెన్నెల కిషోర్‌, సత్య కామెడీ బాగా పండింది. కొన్నిచోట్ల సినిమాటిక్ ఫ్రీడమ్ కాస్త ఎక్కువగా తీసుకున్నారు. క్లైమాక్స్ కూడా కాస్త హడావిడిగా ముగిసినట్టు అనిపిస్తుంది. ఇంకొంచెం శ్రద్ద వహించి ఉంటే సినిమా రేంజ్ మరో స్థాయికి వెళ్లేది.

ఎలా చేశారంటే :

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌ పాత్రలో నిఖిల్ చాలా సెటిల్డ్‌గా నటించాడు. హీరోయిన్ పాత్రకి కూడా సినిమాలో చాలా వెయిట్ ఉంది. లావణ్య త్రిపాఠి ఆ పాత్రకు సంపూర్ణంగా న్యాయం చేసింది. తన రేంజ్‌ను దాటి హీరోయిజం ఎలివేట్ చేసే ప్రయత్నం నిఖిల్ చెయ్యలేదు. అన్ని పాత్రలను కలుపుకుని వెళ్లాడు. పోసాని కృష్ణమురళీ, వెన్నెల కిశోర్, సత్య, విద్యుల్లేఖ  లాంటి యాక్టర్లు సినిమా పరిధిని మరింత విస్తరించారు.

సాంకేతిక విభాగం:

డైరెక్టర్  సంతోష్ తెలుగు వెర్షన్‌ని కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేసి హిట్ అందుకున్నాడనే చెప్పాలి. నేపధ్య సంగీతంతో అదరగొడుతోన్న సామ్ సిఎస్ మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేశాడు.  ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు విషయంలో కూడా ఎక్కడా రాజీ పడలేదు.

ప్లస్ పాయింట్స్

కథ
కథనం
ట్విస్టులు
ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్:

స్లో సెకండాఫ్
ఓవర్ సినిమాటిక్ ఫ్రీడం

ఫైనల్ థాట్ : నిఖిల్ ఖాతాలో మరో మ్యాజికల్ హిట్

 

Related Tags