Flash News: ఏపీలో ఎల్లుండి నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభం.. వివరాలివే..!

కరోనా లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజా రవాణాకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో ఈ రోజు హైదరాబాద్‌లో మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ప్రారంభం అయ్యాయి.

Flash News: ఏపీలో ఎల్లుండి నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభం.. వివరాలివే..!
Follow us

| Edited By:

Updated on: May 19, 2020 | 8:31 PM

కరోనా లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజా రవాణాకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో ఈ రోజు హైదరాబాద్‌లో మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ప్రారంభం అయ్యాయి. ఇక తాజాగా ఏపీలోనూ ఆర్టీసీ బస్సుల ప్రారంభానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 21 నుంచి ఆర్టీసీ బస్సులు రోడెక్కనున్నాయి. వీటికి సంబంధించి టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ఇక ఆర్డినరీ బస్సులు కూడా డిపో నుంచి డిపోకు నడవనున్నాయి. ఆర్టినరీ సహా అన్ని రకాల ప్రయాణాలకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని తెలిపింది. టికెట్లు బుక్ చేసుకున్న వారిని మాత్రమే బస్సు ఎక్కేందుకు అనుమతి ఇస్తామని తెలిపింది. కాగా బస్సులో కూడా భౌతిక దూరాన్ని పాటించేలా ప్రభుత్వం బస్సులకు కొత్త రూపు తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఏపీ నుంచి బస్సులను తెలంగాణలోకి అనుమతించమని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

Read This Story Also: Breaking: ఏపీలో సినిమా షూటింగ్‌లకు అనుమతి..!

Latest Articles