Breaking News
 • హైదరాబాద్‌: తార్నాకలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌ సదస్సు. పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై.
 • ప్రకాశం జిల్లా మార్టూరుకు బయల్దేరిన చంద్రబాబు. ప్రజాచైతన్య యాత్రను ప్రారంభించనున్న చంద్రబాబు.
 • కడప: రాయచోటి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పాల్గొన్న ఎంపీ మిథున్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎంపీ, ఎమ్మెల్యేలు.
 • వరంగల్‌లో వాటర్‌ మెన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ గోదావరి యాత్ర. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి రైతులతో సమావేశం. గోదావరి జలాల సద్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంసలు.
 • అమరావతి: చంద్రబాబు భద్రతను ఉద్దేశపూర్వకంగా తగ్గించారు. అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడడం తగదు-యనమల రామకృష్ణుడు. ఈ విషయంపై మండలిలో చర్చిస్తాం. అవసరమైతే ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తాం-యనమల రామకృష్ణుడు.
 • నిర్మల్‌: మంచిర్యాలలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని అడ్డుకున్న బీజేపీ నేతలు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, సర్దిచెప్పిన పోలీసులు. మంత్రితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ సోయం బాపూరావు.

ఇటువంటి మండలి మనకు అవసరమా? : సీఎం జగన్

AP CM YS Jagan Sensational Comments on AP Capital Issue, ఇటువంటి మండలి మనకు అవసరమా? : సీఎం జగన్

ఏపీలో శాసన మండలి రద్దు దిశగా అడుగులు పడుతున్నాయి. సోమవారం దీనిపై అసెంబ్లీలో తుది నిర్ణయం తీసుకుంటామని సభలో ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్‌. కీలక బిల్లులను మండలిలో సెలెక్ట్‌ కమిటీకి పంపడం, చైర్మన్‌ తీరుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో దానిపై సుదీర్ఘ చర్చ జరిగింది. అసలు మండలిలో ఏం జరిగిందన్న దానిపై మంత్రులు సుదీర్ఘంగా ప్రసంగించారు. చైర్మన్‌ తీరును తప్పుబడుతూనే మండలిని కొనసాగించాలా? వద్దా? అన్న దానిపై చర్చ జరగాల్సిందేని స్పష్టం చేశారు మంత్రులు. మరోవైపు మండలిలో చైర్మన్‌ చేసిన 11 నిమిషాల ప్రసంగాన్ని అసెంబ్లీలో వేసి వినిపించారు ముఖ్యమంత్రి. అది అయ్యాక… ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన మండలి ప్రజలకు మేలు చేసే బిల్లులను అడ్డుకుంటోందని తీవ్రంగా స్పందించారు జగన్‌.

సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు :

 • బుదవారం శాసనమండలిలో జరిగిన పరిణామాలు నా మనసును బాధించాయి
 • ఇది ప్రజల సభ, ప్రజలు ఆమోదించిన సభ, ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం ఏర్పడ్డ సభ
 • మండలి చట్టసభలో భాగం కనుక చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం
 • ఐదు కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు
 • శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిష్పక్షపాతంగా సభను నిర్వహించే పరిస్థితి లేదని చెప్పారు
 • శాసనసభ పంపిన వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో చర్చించి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు..లేదంటే..సవరణలు కోరుతూ తిప్పి పంపొచ్చు
 • కానీ విచక్షణా అధికారం అంటూ కౌన్సిల్ చైర్మన్.. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు..ఇది సమర్ధనీయమా..?
 • ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం చేసిన బిల్లుల్ని.. ఓడిపోయిన పార్టీ అడ్డుకోవడం చట్టవిరుద్ధం
 • రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించింన మండలిని.. కొనసాగించాలా? వద్దా? అనే అంశాన్ని ప్రజలందరూ ఆలోచించాలి
 •  ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ లు ఉంటాయి
 • దేశంలోని 28 రాష్ట్రాల్లో కేవలం 6 చోట్ల మాత్రమే శాసన మండళ్లు ఉన్నాయి
 • మండలి నిర్వాహణకు ప్రతి ఏడాది రూ. 60 కోట్లు ఖర్చవుతోంది
 • అసెంబ్లీలోనే అన్ని రంగాల మేధావులు, నిపుణులు ఉన్నారు
 • మండలిని రద్దు చేసే అంశంపై అసెంబ్లలో సోమవారం సుదీర్ఘంగా చర్చించి, ఒక నిర్ణయం తీసుకుందాం

Related Tags