హైదరాబాద్‌కు చేరిన ఏపీ బోట్లు

భారీ వర్షాలు వరదలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురైన నేపథ్యంలో..

హైదరాబాద్‌కు చేరిన ఏపీ బోట్లు
Follow us

|

Updated on: Oct 20, 2020 | 5:54 PM

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో వాతావరణ శాఖ మరో చేదు కబురు చెప్పింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో మూరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో హైదరాబాద్‌లో అధికారులు అప్రమత్తం అయ్యారు.

భారీ వర్షాలు వరదలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురైన నేపథ్యంలో ఇప్పటికే ఏపీ సహా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలని బొట్లు కోసం అభ్యర్ధించారు కేసీఆర్. కేసీఆర్ అడిగిన వెంటనే జగన్ తెలంగాణాకు బోట్లు పంపమని ఆదేశించారు. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ టూరిజం కి చెందిన వివిధ పర్యటక ప్రాంతాల నుండి 40 బోట్లు హైదరాబాద్ కు చేరుకున్నాయి.

Latest Articles