ఇంటర్నేషనల్ లెవెల్ లో అనుష్క ‘సైలెన్స్’

తమిళ హీరో మాధవన్, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కబోయే చిత్రం ‘సైలెన్స్’. ఇక ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ నుంచి అమెరికా లో మొదలు కానుంది. ఇందులో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడసన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు హాలీవుడ్ లో కూడా రిలీజ్ […]

ఇంటర్నేషనల్ లెవెల్ లో అనుష్క ‘సైలెన్స్’
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:07 PM

తమిళ హీరో మాధవన్, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కబోయే చిత్రం ‘సైలెన్స్’. ఇక ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ నుంచి అమెరికా లో మొదలు కానుంది. ఇందులో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడసన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తారట. అమెరికాలోనే ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో అనుష్క పాత్ర వైవిధ్యభరితంగా ఉంటుందని వినికిడి. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ కు చెందిన నటీనటులు ప్రధాన పాత్రలు పోషించబోతున్నారట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.