నేడే అంతర్వేది రథం నిర్మాణానికి పూజా కార్యక్రమం

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథం నిర్మాణానికి పూజా కార్యక్రమం ఇవాళ జరుగనుంది. ఉ.11:15 గంటలకు ముహూర్తం. పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణ డిజైన్లను దేవదాయశాఖ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 41 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఏడంతస్తుల్లో ఆలయ రథం ఉంటుంది. ఆరు చక్రాలతో కూడిన కొత్త రథం నిర్మాణంతో పాటు, రథశాల మరమ్మతులకు రూ.95 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. వచ్చే […]

నేడే అంతర్వేది రథం నిర్మాణానికి పూజా కార్యక్రమం
Follow us

|

Updated on: Sep 27, 2020 | 7:38 AM

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథం నిర్మాణానికి పూజా కార్యక్రమం ఇవాళ జరుగనుంది. ఉ.11:15 గంటలకు ముహూర్తం. పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణ డిజైన్లను దేవదాయశాఖ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 41 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఏడంతస్తుల్లో ఆలయ రథం ఉంటుంది. ఆరు చక్రాలతో కూడిన కొత్త రథం నిర్మాణంతో పాటు, రథశాల మరమ్మతులకు రూ.95 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగబోయే కల్యాణోత్సవాల సమయానికి కొత్త రథ నిర్మాణ ప్రక్రియ పూర్తి కావాలని దేవాదాయశాఖ మంత్రి ఇప్పటికే ఆదేశించారు.