YS Jagan: కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరుబాట.. కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్

|

Dec 04, 2024 | 5:15 PM

ఏపీలో పాలనపై అందరూ అసంతృప్తితో ఉన్నారని.. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు సంధించారు.. బుధవారం తాడేపల్లిలోని తన కార్యాయలంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రదాన కార్యదర్శులు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో వైసీపీ చీఫ్ జగన్‌ సమావేశం అయ్యారు.

YS Jagan: కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరుబాట.. కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్
Ys Jagan
Follow us on

సూపర్-6 హామీలు అమలు చేయలేదు.. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉందని పోరుబాటకు సిద్ధమవ్వాలని వైసీపీ పార్టీ శ్రేణులకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.. ఏపీలో పాలనపై అందరూ అసంతృప్తితో ఉన్నారని.. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు సంధించారు.. బుధవారం తాడేపల్లిలోని తన కార్యాయలంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రదాన కార్యదర్శులు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో వైసీపీ చీఫ్ జగన్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో హామీలు అమలు చేయలేదని.. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రజల తరపున గళం విప్పాల్సిన సమయం వచ్చిందంటూ పేర్కొన్నారు. వైసీపీ పోరుబాటలో జిల్లా అధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఆందోళనలపై కార్యాచరణను చేపట్టినట్లు వైఎస్ జగన్‌ వివరించారు.

కీలక అంశాలపై వైసీపీ శ్రేణులు గళం విప్పాల్సిన సమయం వచ్చిందని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోరుబాట కార్యచరణను ప్రకటించారు.. రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై పోరుబాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు..

వీడియో చూడండి..

డిసెంబర్‌ 11వ తేదీన: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు, కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించాలని కేడర్ కు సూచించారు. రూ.20 వేల పెట్టుబడి సహాయం, ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంటల భీమా పునరుద్ధరణ తదితర అంశాలపై గళమెత్తనున్నట్లు తెలిపారు.

డిసెంబర్‌ 27వ తేదీన: పెంచిన కరెంటు ఛార్జీలపై ఆందోళన నిర్వహించాలన్నారు.. ఎస్‌ఈ కార్యాలయాలు, సీఎండీ కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్లి వినతి పత్రాలు అందించనున్నట్లు తెలిపారు.

జనవరి 3వ తేదీన: ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అంశంపై పోరుబాట నిర్వహించనున్నట్లు తెలిపారు. పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలంటూ.. విద్యార్థులతో కలిసి జనవరి 3న కలెక్టర్‌ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించనున్నట్లు వైఎస్ జగన్ కార్యచరణను ప్రకటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..