AP Weather: ఏపీని ఇంకా వీడని వానలు.. మరో అల్పపీడనం ఏర్పడే చాన్స్.. ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన

2 రోజులపాటు దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలు, అనేకచోట్ల తేలికపాటి నుండి మోస్తారువర్షాలు పడే చాన్స్ ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది.

AP Weather: ఏపీని ఇంకా వీడని వానలు.. మరో అల్పపీడనం ఏర్పడే చాన్స్.. ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన
Ap Weather Report
Follow us

|

Updated on: Nov 13, 2022 | 7:45 PM

ఏపీలో వర్షాలు కంటిన్యూ అవ్వనున్నాయి. అవును..  అల్పపీడన ప్రాంతంతో సంబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి కేరళ తీరానికి ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ & 3.1 కి.మీ మధ్య కొనసాగుతుంది. అంతేకాదు నవంబర్ 16  నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం & పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

————————————————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :– 

ఈరోజు:- వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీయవచ్చును .

రేపు, ఎల్లుండి:- వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- 

ఈరోజు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది . ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీయవచ్చును.

రేపు, ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ :-

ఈరోజు :-  తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .

రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..