AP News: ఆ కళాకారుడి దేశభక్తికి ఫిదా అవ్వాల్సిందే.. చిరుధాన్యాలతో చక్కగా.. మీరూ లుక్కేయండి

బానిసత్వం నుంచి భారతమాత సంకెళ్లు తెంచుకొని స్వాతంత్రానికి 78 ఏళ్లు. ఈరోజు భారతీయులంతా స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నారంటే.. దాని వెనుక స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు..

AP News: ఆ కళాకారుడి దేశభక్తికి ఫిదా అవ్వాల్సిందే.. చిరుధాన్యాలతో చక్కగా.. మీరూ లుక్కేయండి
Trending
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 14, 2024 | 8:20 PM

బానిసత్వం నుంచి భారతమాత సంకెళ్లు తెంచుకొని స్వాతంత్రానికి 78 ఏళ్లు. ఈరోజు భారతీయులంతా స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నారంటే.. దాని వెనుక స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు కృషి శ్రమ దాగి ఉన్నాయి. ఎందరో మహానుభావుల త్యాగధనుల పుణ్యమా అని.. ఈరోజు మనం ఆజాద్ దేశ్‌లో ఉన్నాం. అందుకే ఏటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన ఆ మహానుభావులకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. అందుకే విశాఖకు చెందిన ఓ కళాకారుడు.. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిరుధాన్యాలతో చిత్రాన్ని వేసి అంకితం చేశాడు.

సందేశాత్మక చిత్రం..!

సహజంగా చిత్రకారులు కళాకారులు వాళ్ల అభిరుచులకు అనుగుణంగా కళాఖండాలు తయారుచేస్తారు. మోకా విజయ్ కుమార్ మాత్రం కాస్త భిన్నం. గతేడాది రైతులను ప్రోత్సహించి, సైనికుల కష్టాన్ని గుర్తు చేస్తూ చిరుధాన్యాలకు ప్రాచుర్యం కల్పించేలా చిత్రకారుడు మోకా విజయ్‌ కుమార్‌ చిరుధాన్యాల చిత్రం వేశాడు. ఈసారి సరికొత్తగా ఆలోచించాడు. ఏకంగా చిరుధాన్యాలతోనే సందేశాత్మక చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఇండియా చిత్రపటం తో పాటు.. మువ్వన్నెల పతాకాన్ని భరతమాత రెండు చేతులతో పట్టుకున్నట్టు, ఆపైన స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలు కూడా వేశారు. మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ లోకమాన్య తిలక్ చిత్రాలు వేశారు. అంతేకాదు శ్వేత పావురం, ఆకులను నోట్లో పట్టుకొని ఎగురుతున్నట్టు సందేశత్మక చిత్రాన్ని రూపొందించారు.

ఒక్కో రంగు కోసం ఒక్కో చిరుధాన్యం..

అయిదు అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు తో.. ఆరుగురు స్వాతంత్ర సమరయోధులు, భరతమాత జెండా పట్టుకున్నట్టు రూపొందించిన చిత్రం ఇది. 80 శాతం చిరుధాన్యాలు ( మిల్లెట్స్), కొద్దిపాటి రంగులతో సందేశాత్మక చిత్రం వేసి ఔరా అనిపించ్చాడు. ఈ చిత్రంలో వేరువేరు రంగులు కనిపిస్తున్నప్పటికీ అన్నీ చిరుధాన్యాలే. జెండా, బ్యాక్ డ్రాప్ తప్ప ఆరుగురు స్వాతంత్ర సమరయోధులు, ఇండియా మ్యాప్, భరతమాత చేతులు, ఇండియా ఫ్లాగ్ స్టిక్, పావురం ఆకులు అన్నీ కూడా చిరుధాన్యలే. చిత్రంలో తెల్లగా కనిపించేవన్నీ అరికెలు, ఎల్లో గా ఉండేవన్నీ కొర్రలు, ఆరెంజ్ కలర్ కూడా ప్రత్యేకంగా కొర్రలను రప్పించి ఈ చిత్రానికి వినియోగించారు. సామలను బ్రౌన్ కలర్ కోసం వినియోగించారు. రెడ్ కలర్ కోసం రాగులు, బ్లాక్ కలర్ కోసం నల్ల సామలు వినియోగించారు. ఒక్కో స్వాతంత్ర సమరయోధుడు చిత్రపటం కోసం 4-5 రోజులు.. 26 రోజుల్లో పూర్తి చిత్రపటం కోసం క్షమించమని అంటున్నారు ఈ చిత్రకారుడు. చిత్రంలోని 20% బ్యాక్ డ్రాప్రిల్ కలర్స్ వినియోగించారు. ఫ్లాగ్ ట్రై కలర్.. రంగుల పాడినప్పటికీ ఫ్లాగ్ స్టిక్కంతా మిల్లెట్స్ తొలగించానని అంటున్నారు మోకా విజయ్ కుమార్. ఈ చిత్రంలో ఒక్కొక్క భాగం ఒక్కో సందేశాన్నిస్తోంది. సస్యశ్యామలం కోసం ఆకులు, శాంతి కోసం పావురం కూడా మిల్లెట్స్ తోనే వేశారు. మన దేశంలో పండే చిరుధాన్యాల ను చిత్రపటాంలా పరిచి ఔరా అనిపించ్చాడు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని, భరతమాత, స్వాతంత్ర్య సమరయోధులు, చిరుధాన్యాలను మిళితం చేస్తూ తీర్చిదిద్దిన ఈ తైలవర్ణ, చిరుధాన్యాల చిత్రపటం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.

Ap News

రైల్వే ఉద్యోగిగా.. చిత్రకారుడిగా..!

విశాఖకు చెందిన విజయ్ కుమార్ రైల్వే ఉద్యోగి. చిన్నప్పటి నుంచి కళలు అంటే ఇష్టం. ఎన్నో రకాలైన కలలో కలఖండాలు తయారు చేసి అందరి మన్ననలు పొందారు. మనిషికి పోషక విలువ ఇచ్చే చిరుధాన్యాలను అందరూ మర్చిపోతున్న నేపథ్యంలో.. వాటికి మరింత ప్రాచుర్యం కల్పించి అన్నదాతకు వెన్ను తట్టాలనేది విజయ్ కుమార్ ఆలోచన. విశాఖలో జరిగిన జీ ట్వంటీ సమావేశాల సందర్భంగా.. అనేక దేశాల పారిశ్రామిక దిగ్గజాల చిత్రపటాలను చిరుధాన్యాలతో చిత్రీకరించి బహుకరించారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చిరుధాన్యాలతో రూపొందించిన చిత్రపటాన్ని బహుకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు దేశంలోని ప్రముఖ దిగ్గజాల చిత్రపటాలను కూడా వేశారు. అంతేకాదు దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు, శిక్షణ తరగతులతో ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. 2017 లో తానా, 2019 లో నాటా ఆర్ట్ ఇవేంట్, 2021 లో వాషింగ్టన్ డిసి ఆన్లైన్ ప్రోగ్రాం, 2022లో న్యూ జెర్సీలో జరిగిన కాన్ఫరెన్స్కు హాజరై తన చిరుధాన్యాల చిత్రపటాలకు విదేశాల్లో సైతం ప్రాచుర్యం కల్పించారు. అందరి మన్ననలు అందుకున్నారు. పోషక విలువలు ఇచ్చే చిరుధాన్యాలను మరిచిపోకుండా ఆరోగ్యం కాపాడుకోవాలని.. వాటిని ప్రోత్సహించాలని.. తద్వారా రైతన్నకు ఆదుకొని భారతదేశాన్ని సస్యశ మాలంగా ఉంచాలని కోరుతున్నారు విజయ్ కుమార్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కాలినడకన తిరుమలకు చేరుకున్న హీరో మహేశ్‌ బాబు ఫ్యామిలీ
కాలినడకన తిరుమలకు చేరుకున్న హీరో మహేశ్‌ బాబు ఫ్యామిలీ
ఆ టోర్నీ నుంచి రోహిత్, కోహ్లీ ఔట్.. రెడ్ బాల్‌కు తిరిగొచ్చిన పంత్
ఆ టోర్నీ నుంచి రోహిత్, కోహ్లీ ఔట్.. రెడ్ బాల్‌కు తిరిగొచ్చిన పంత్
మళ్లీ ట్రెండింగ్‌లోకొచ్చిన కల్కి 2898 ఏడీ. కీర్తి నే కారణమా.!
మళ్లీ ట్రెండింగ్‌లోకొచ్చిన కల్కి 2898 ఏడీ. కీర్తి నే కారణమా.!
చైనాలో చరిత్ర సృష్టించిన భరతనాట్యం.. ఈ పదమూడేండ్ల చిన్నారిఇప్పుడు
చైనాలో చరిత్ర సృష్టించిన భరతనాట్యం.. ఈ పదమూడేండ్ల చిన్నారిఇప్పుడు
కోహ్లీ, రోహిత్‌లకు నచ్చలే.. కట్‌చేస్తే.. 5 మెయిడీన్లతో 5 వికెట్లు
కోహ్లీ, రోహిత్‌లకు నచ్చలే.. కట్‌చేస్తే.. 5 మెయిడీన్లతో 5 వికెట్లు
వెల్లుల్లి కూరగాయనా.? మసాలానా.? హైకోర్టుకు చేరిన వ్యవహారం...
వెల్లుల్లి కూరగాయనా.? మసాలానా.? హైకోర్టుకు చేరిన వ్యవహారం...
సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ చేసిన అద్భుత దృశ్యం..వీడియో వైరల్
సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ చేసిన అద్భుత దృశ్యం..వీడియో వైరల్
జోరుమీదున్న నందమూరి బాలయ్య.. 2023 లో బాలయ్య మార్క్ 2025 రిపీట్.!
జోరుమీదున్న నందమూరి బాలయ్య.. 2023 లో బాలయ్య మార్క్ 2025 రిపీట్.!
అయోధ్య రామయ్యను వదలని దొగలు.. ఆలయ పరిసరాల్లో లైట్లు చోరీ.. విలువ
అయోధ్య రామయ్యను వదలని దొగలు.. ఆలయ పరిసరాల్లో లైట్లు చోరీ.. విలువ
టీమిండియా నంబర్ వన్ బ్యాటర్‌గా రోహిత్.. బాబర్‌ పీఠానికి మూడిందిగా
టీమిండియా నంబర్ వన్ బ్యాటర్‌గా రోహిత్.. బాబర్‌ పీఠానికి మూడిందిగా
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..