Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ పథకానికి చంద్రబాబు సతీమణి రూ. 1 కోటి విరాళం

ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కాగా ఈ నేపథ్యంలో అన్నక్యాంటీన్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి విరాళం అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రూ.1 కోటి విరాళాన్ని ప్రభుత్వానికి అందించారు. ఈ మేరకు కోటి రూపాయల చెక్కున ఉండవల్లి నివాసంలో మున్సిపల్ శాఖ...

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ పథకానికి చంద్రబాబు సతీమణి రూ. 1 కోటి విరాళం
Nara Bhuvaneshwari
Follow us

|

Updated on: Aug 14, 2024 | 7:24 PM

రూ. 5కే భోజనం అందించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ క్యాంటీన్లను ఆగస్టు 15వ తేదీ నుంచి మళ్లీ పునఃప్రారంభిస్తున్నారు. తొలి విడతలో భాగంగా కొన్ని పట్టణాల్లో అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గురువారం అన్న క్యాంటీన్లు ప్రారంభంకానున్నాయి.

ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కాగా ఈ నేపథ్యంలో అన్నక్యాంటీన్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి విరాళం అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రూ.1 కోటి విరాళాన్ని ప్రభుత్వానికి అందించారు. ఈ మేరకు కోటి రూపాయల చెక్కున ఉండవల్లి నివాసంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు అందించారు. పేదల కడుపునింపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్నక్యాంటీన్లు ఎంతో గొప్ప కార్యక్రమం అని ఈ సందర్భంగా భువనేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అనేది స్వర్గీయ ఎన్టీఆర్ నినాదమని చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి తలపెట్టిన ఈ కార్యక్రమానికి తన వంతు మద్ధతుగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ విరాళం అందించినట్లు భువనేశ్వరి చెప్పుకొచ్చారు. ఇక రూ. 5కే ఆకలి తీర్చడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమన్న భువనేశ్వరి.. పేదలకు, రోజు కూలీలకు, కార్మికులకు ఈ అన్న క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.

పేదల జీవన ప్రమాణాలు పెరిగేలా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలతో పాటు అభినందనలు తెలియజేశారు. ఎన్ని సంక్షేమ పథకాలున్నా పేదల కడుపు నింపే అన్నక్యాంటీన్ లాంటి కార్యక్రమం మహోన్నతమైదని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. పేదల కోసం ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని తాను ఆకాంక్షిస్తున్నట్లు భువనేశ్వరి చెప్పుకొచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..