భక్తుల దర్శనానికి ఎలాంటి ఆటంకం ఉండదు: వైవీ సుబ్బారెడ్డి

తిరుమల కొండపై భక్తుల దర్శనాలకు ఆటంకం ఉండదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. భక్తుల ద్వారా కరోనా వ్యాప్తి చెందడం లేదని తాము నిర్ధారణకు వచ్చామని ఆయన అన్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 2:43 pm, Tue, 21 July 20
భక్తుల దర్శనానికి ఎలాంటి ఆటంకం ఉండదు: వైవీ సుబ్బారెడ్డి

తిరుమల కొండపై భక్తుల దర్శనాలకు ఆటంకం ఉండదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. భక్తుల ద్వారా కరోనా వ్యాప్తి చెందడం లేదని తాము నిర్ధారణకు వచ్చామని ఆయన అన్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు దర్శనం కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అయితే తిరుపతిలో లాక్‌డౌన్ నేపథ్యంలో స్థానిక బుకింగ్‌ నిలిపివేశామని ఆయన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉండే వారు తిరుమలకు రావొద్దని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. అర్చకులు, ఉద్యోగులకు మెరుగైన చికిత్స అందిస్తామని.. భక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వివరించారు. కాగా కరోనా నేపథ్యంలో తిరుపతిలో మరోసారి లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగష్టు 4 వరకు ఈ లాక్‌డౌన్ ఉండనుంది. ఈ క్రమంలో తిరుమల దర్శనాలకు వెళ్లే వాహనాలకు నగరంలోని బైపాస్‌ రోడ్డు నుంచి పోలీసులు అనుమతిని ఇస్తున్నారు.