కాంగ్రెస్ ఆశావాహులకు ఉత్తమ్ ఝలక్.. రీజన్ తెలిస్తే షాక్..

త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు.. టీపీసీసీ చీఫ్ ఝలక్ ఇచ్చారు. అభ్యర్ధుల ఎంపికపై బుధవారం ఉదయం స్థానికంగా సమావేశాలు నిర్వహించి.. ఈ నెల 9వ తేదీ గురువారం 11.00 గంటలలోపు అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్ధులకు కండిషన్స్ పెట్టారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించకుండా ఉండేందుకు.. పోటీ చేసే అభ్యర్ధులు రూ.20 స్టాంప్ పేపరుతో అఫిడవిట్ ఇవ్వాలని పేర్కొన్నారు. అంతేకాదు.. అభ్యర్ధుల గెలుపుకోసం.. […]

కాంగ్రెస్ ఆశావాహులకు ఉత్తమ్ ఝలక్.. రీజన్ తెలిస్తే షాక్..
Follow us

| Edited By:

Updated on: Jan 08, 2020 | 6:17 AM

త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు.. టీపీసీసీ చీఫ్ ఝలక్ ఇచ్చారు. అభ్యర్ధుల ఎంపికపై బుధవారం ఉదయం స్థానికంగా సమావేశాలు నిర్వహించి.. ఈ నెల 9వ తేదీ గురువారం 11.00 గంటలలోపు అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్ధులకు కండిషన్స్ పెట్టారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించకుండా ఉండేందుకు.. పోటీ చేసే అభ్యర్ధులు రూ.20 స్టాంప్ పేపరుతో అఫిడవిట్ ఇవ్వాలని పేర్కొన్నారు. అంతేకాదు.. అభ్యర్ధుల గెలుపుకోసం.. కొంతమంది స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం కూడా చేయిస్తామన్నారు.

కాగా, మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పోలింగ్ జరుగుతుందని ఈసీ ప్రకటించిన వెంటనే.. మంగళవారం రాత్రి కాంగ్రెస్ ముఖ్యనేతలు హైదరాబాద్ గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. మునిసిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. స్థానిక అంశాలవారీగా లోకల్ మేనిఫెస్టో తయారు చేయాలని డిసైడ్ అయ్యారు.