ఇద్దరు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

కడప జిల్లాలోని మైదుకూరులో ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఎర్రచందనంను స్మగ్లర్లు తరలిస్తున్నారన్న సమాచారంతో ఆదివారం టాస్క్‌ఫోర్సు సిబ్బంది, మైదుకూరు పోలీసులు.. పోరుమావిళ్ల-మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలోని ఎర్రచెరువు క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు చేశారు. తమిళనాడుకు చెందిన మినీ లారీని తనిఖీ చేయగా.. అందులో 90ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన ఇద్దరు అంతరాష్ట్ర స్మగ్లర్లని.. వారిలో కోల్‌కతా కాలీఘట్‌కు చెందిన రాణా దత్తా, తమిళనాడుకు చెందిన ఉలగంధన్ వేలు ఉన్నారని […]

ఇద్దరు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్


కడప జిల్లాలోని మైదుకూరులో ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఎర్రచందనంను స్మగ్లర్లు తరలిస్తున్నారన్న సమాచారంతో ఆదివారం టాస్క్‌ఫోర్సు సిబ్బంది, మైదుకూరు పోలీసులు.. పోరుమావిళ్ల-మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలోని ఎర్రచెరువు క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు చేశారు. తమిళనాడుకు చెందిన మినీ లారీని తనిఖీ చేయగా.. అందులో 90ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన ఇద్దరు అంతరాష్ట్ర స్మగ్లర్లని.. వారిలో కోల్‌కతా కాలీఘట్‌కు చెందిన రాణా దత్తా, తమిళనాడుకు చెందిన ఉలగంధన్ వేలు ఉన్నారని అధికారులు ప్రకటించారు. వీరి వద్ద నుంచి దుంగలతో పాటు ఒక వాహనం, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని జిల్లా అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ చెప్పారు.