తెలంగాణ మద్యం ప్రియులకు భారీ షాక్.. ఇక నుంచి..

మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్ రాబోతున్న వేళ.. మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అన్ని రకాల లిక్కర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 10శాతం వరకు అన్ని బ్రాండ్లపై పెంచుతున్నట్లు.. అబ్కారీ శాఖ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. పెరిగిన ధరలు మంగళ వారం నుంచి అమలులోకి రానున్నాయి. బీర్లపై రూ.20 నుంచి రూ. 40 వరకు పెరగగా.. లిక్కర్‌పై రూ.20 నుంచి రూ.100కు వరకు పెరిగాయి. పాత మద్యం నిల్వలపై పెరిగిన […]

తెలంగాణ మద్యం ప్రియులకు భారీ షాక్.. ఇక నుంచి..
Follow us

| Edited By:

Updated on: Dec 17, 2019 | 2:28 AM

మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్ రాబోతున్న వేళ.. మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అన్ని రకాల లిక్కర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 10శాతం వరకు అన్ని బ్రాండ్లపై పెంచుతున్నట్లు.. అబ్కారీ శాఖ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. పెరిగిన ధరలు మంగళ వారం నుంచి అమలులోకి రానున్నాయి. బీర్లపై రూ.20 నుంచి రూ. 40 వరకు పెరగగా.. లిక్కర్‌పై రూ.20 నుంచి రూ.100కు వరకు పెరిగాయి. పాత మద్యం నిల్వలపై పెరిగిన ధరలు వర్తించవని తెలంగాణ ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. పెంచిన ధరలతో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం రానుంది. ప్రతి నెలా దాదాపు రూ.350 కోట్ల ఆదాయం రానుంది. రెగ్యూలర్‌గా అమ్ముడుపోయే వాటిపై అధిక ధరలు పెంచినట్లు తెలుస్తోంది. అయితే ఫారీన్ మద్యంపై మాత్రం నామమాత్రంగానే పెంపు చేసినట్లు తెలుస్తోంది.

కాగా, రాష్ట్రంలో దిశ, సమత వంటి అత్యాచార ఘటనల నేపథ్యంలో.. మద్యం విక్రయాలను నిషేధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. తీవ్రమైన నేరాలన్నింటికీ మద్యమే ప్రధాన కారణం అవుతోందని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్‌తో రాష్ట్రానికి ఆదాయం భారీగా తగ్గింది. అటు కేంద్రం నుంచి వచ్చే నిధుల్లోనూ భారీగా కోత విధించారు. ఈ క్రమంలో అన్ని శాఖలు ఆర్థిక నియంత్రణ పాటించాలంటూ.. మంత్రులకు, అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి మద్యం ధరలను పెంచినట్లు తెలుస్తోంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు