AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Lokesh: వైజాక్‌కు ఫిలిం ఇండస్ట్రీ.. నారా లోకేష్‌, రానా మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు దేశీయ, అంతర్జాతీయ సంస్థలు భారీగా ఆసక్తి చూపించాయి. క్లీన్ ఎనర్జీ నుంచి డేటా సెంటర్ల వరకు.. తయారీ రంగం నుంచి టెక్నాలజీ పరిశ్రమల వరకు పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి.

Nara Lokesh: వైజాక్‌కు ఫిలిం ఇండస్ట్రీ.. నారా లోకేష్‌, రానా మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్
Lokesh, Rana
Rajeev Rayala
|

Updated on: Nov 13, 2026 | 8:38 PM

Share

శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో 450 మందికి పైగా విదేశీ ప్రతినిధులు, మొత్తం 1,400 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం 303 అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదరగా.. సుమారు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పెట్టుబడులు కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు మరింత ఊతం లభించనుంది. మరోవైపు ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై కీలక వివరాలు వెల్లడించారు. 2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏపీకి రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. తాజాగా సీఐఐ సమ్మిట్‌లో ప్రకటించిన రూ.9.89 లక్షల కోట్లతో కలిపి మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల విలువ రూ.32.49 లక్షల కోట్లకు చేరుతుందని చెప్పారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనల్లో 526 ప్రాజెక్టులకు భూమి, ప్రోత్సాహకాల అనుమతులు లభించాయని, వీటి విలువ రూ.17.10 లక్షల కోట్లు అని వివరించారు. అలాగే రూ.7.30 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులు నిర్మాణ దశకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. పెట్టుబడుల ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిశ్రమలుగా మారేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈ సీఐఐ సమ్మిట్‌లో మరో ఆసక్తికర అంశం కూడా చోటుచేసుకుంది. ఏపీకి ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకొచ్చే అంశంపై మంత్రి నారా లోకేష్, నటుడు రానా దగ్గుబాటి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. విశాఖపట్నంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తోందని రానా ప్రశ్నించారు. దీనికి స్పందించిన లోకేష్.. విశాఖకు ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్నట్లుగా వైజాగ్‌లోనూ సినిమా నిర్మాణానికి అవసరమైన పూర్తి ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కేవలం షూటింగ్స్ మాత్రమే కాకుండా స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్, ఇతర సినిమా సంబంధిత కార్యకలాపాలకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి రావాలని అభిప్రాయపడ్డారు.

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ముందుకొచ్చి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లోకేష్ ఈ సందర్భంగా కోరారు. దీనిపై స్పందించిన రానా.. విశాఖలో ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో తెలుగు సినిమా పరిశ్రమ ఎదగడానికి స్టూడియోలు, నిర్మాణ సదుపాయాలు, ఇతర మౌలిక వసతులు కీలక పాత్ర పోషించాయని కూడా ఆయన వివరించారు. దీంతో విశాఖలోనూ అలాంటి సినీ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసే అంశంపై చర్చ ఆసక్తికరంగా మారింది. మొత్తంగా విశాఖ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల పరంగా కీలక వేదికగా నిలిచింది. భారీ పెట్టుబడి ప్రతిపాదనలు, అంతర్జాతీయ సంస్థల ఆసక్తి, కొత్త పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఆశలు చిగురించాయి. మరోవైపు విశాఖలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పాటుపై లోకేష్, రానా చేసిన చర్చ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ పెట్టుబడి ప్రతిపాదనలన్నీ ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి? ఎన్ని పరిశ్రమలు ప్రారంభమవుతాయి? ఎంతమందికి ఉద్యోగాలు లభిస్తాయి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో