Asani Cyclone News: తీరం వైపు దూసుకొస్తున్న తుపాను.. పలు విమాన సర్వీసులు రద్దు

| Edited By: Anil kumar poka

May 11, 2022 | 4:38 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అసని(Asani) తుపాను తీవ్ర తుపానుగా మారింది. దీని కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు జాగ్రత్తగా...

Asani Cyclone News:  తీరం వైపు దూసుకొస్తున్న తుపాను.. పలు విమాన సర్వీసులు రద్దు
Asani
Follow us on

Asani Cyclone Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అసని(Asani) తుపాను తీవ్ర తుపానుగా మారింది. దీని కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. దీంతో అప్రమత్తమైన ఏపీ అధికారులు ముందస్తు జాగ్రత్తగా విమాన సర్వీసులను రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి వెళ్లే అన్ని ఇండిగో విమానాలను రద్దు చేశారు. మొత్తం 23 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో(IndiGo) ప్రకటించింది. ఎయిర్ ఏషియాకు(Air Asia) చెందిన దిల్లీ- విశాఖ, బెంగళూరు- విశాఖ విమాన సర్వీసులనూ రద్దు చేస్తున్నట్లు ఆ విమానయాన సంస్థ ప్రకటించింది. ఎయిర్‌ ఇండియాకు చెందిన ముంబయి- రాయపూర్‌- విశాఖ, దిల్లీ- విశాఖ విమానాలు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలించక పోవడంతో రెండోరోజూ విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విమానయాన సర్వీసులు రద్దు కావటంతో ఎటు వెళ్లాలో తెలియక ఎయిర్ పోర్ట్ వద్దే ప్రయాణీకులు పడిగాపులు పడుతున్నారు. విశాఖ నుంచి వెళ్లే విమానాలు రద్దవటంతో విదేశాలకు వెళ్లాల్సిన లింక్ సర్వీసులను మిస్సవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

తుపాను ప్రభావంతో ఈ రోజు కోస్తాంధ్రలో, రేపు ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తుపాను ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్నిచోట్ల చిరుజల్లులు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి.

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని ఆనందపురం, అచ్యుతాపురం మండలాల్లో గాలుల తీవ్రతకు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వాటిని సరిచేసి, విద్యుత్ పునరుద్ధరణ చర్యలు తీసుకున్నట్లు ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ మహేంద్రనాథ్‌ తెలిపారు. కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి విశాఖకు సోమవారం మధ్యాహ్నం నుంచి వచ్చిన విమానాలు వాతావరణం అనుకూలించకపోవడంతో చాలాసేపు గాలిలో చక్కర్లుకొట్టి వెను దిరిగాయి. తుపాను నేపథ్యంలో వాల్తేరు రైల్వే డివిజన్‌ అప్రమత్తమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Multibagger Returns: ఇన్వెస్టర్లకు సిరులు కురిపించిన మెడికల్ డివైజెస్ కంపెనీ.. రెండేళ్లలో ఊహించని రాబడులు..

CDAC Recruitment 2022: ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఉన్నారా? సీడాక్‌లో భారీగా ఉద్యోగావకాశాలు..పూర్తివివరాలివే!