నిజామాబాద్ ఎడపల్లి మండలం జనకంపెట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆటో, కారు ఢీ కొని ఐదుగురు మృతి చెందారు. కందుర్‌లో విందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు. మృతుల్లో బాలమణి, నాగమణి, చిక్కేలా సాయిలు, రేంజర్ల సాయిలు, ఆటో డ్రైవర్ నాయిమ్‌లు ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లనే.. ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఒకే గ్రామానికి చెందిన వారు ఐదుగురు చనిపోవడంతో.. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.