కొత్త సంవత్సరం ఆరంభం నుంచి పసిడి పరుగులు పెడుతూనే ఉంది. సంక్రాంతి వచ్చేసింది..కానీ, బంగారం మాత్రం ఎక్కడా తగ్గేదెలే అంటూ ధర పెరుగుతూనే ఉంది. ఇప్పుడు దేశంలో బంగారం ధర రూ.80 వేలకు చేరువైంది. దేశవ్యాప్తంగా చాలా నగరాలు పట్టణాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,000 పైన ఉంది. ముఖ్యంగా ఆభరణాల తయారీలో 22 క్యారెట్ల గోల్డెన్ ఉపయోగిస్తారు. అందుకే ఆభరణాల కొనుగోలుదారులకు 22 క్యారెట్ల బంగారం ధర అతి ముఖ్యమైనది. ఈ ధరకు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలనే నిర్ణయం సరైనదేనా లేదా కొనుగోలుదారులు ధర తగ్గే వరకు వేచి ఉండాలా..? ప్రధాన పట్టణాలు నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాల్లోకి వెళితే..