కరోనాపై పోరు.. ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది.

కరోనాపై పోరు.. ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం
Follow us

| Edited By:

Updated on: Jun 27, 2020 | 2:36 PM

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. కరోనా టెస్ట్‌ల సంఖ్యను పెంచడంతో పాటు త్వరితగతిన పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఐ మాస్క్ బస్సులను రంగంలోకి దింపింది. విజయవాడ సిటీలో 8 చోట్ల శ్వాబ్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి.. రోజుకు 2వేల మందికి టెస్ట్‌లు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఇక ఐ మాస్క్ బస్సుల ద్వారా జరుగుతున్న కరోనా టెస్ట్‌ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. ప్రతి అరగంటకు ఒకసారి వాహనాలను హైపోక్లోరైడ్ స్ప్రే చేయాలని శానిటరీ సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఇంతియాజ్ విఙ్ఞప్తి చేశారు. కాగా ఏపీలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 12వేలను దాటేసింది.