Kakinada: రెండు లారీలు ఢీ.. చెలరేగిన మంటలు.. ముగ్గురు సజీవ దహనం..

|

Dec 02, 2022 | 7:05 AM

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొన్న ఈ ఘటనలో మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలోని జాతీయ...

Kakinada: రెండు లారీలు ఢీ.. చెలరేగిన మంటలు.. ముగ్గురు సజీవ దహనం..
Fire Accident In Kakinada
Follow us on

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొన్న ఈ ఘటనలో మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కంటైనర్ ను కత్తిపూడి వైపు నుంచి వస్తున్న ఇసుక లారీ డివైడర్‌ మీద నుంచి దూసుకొచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంటనే మంటలు చెలరేగాయి. సమచాచారంఅందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. రెండు లారీలు ఒకదానిలో మరొకటి ఇరుక్కున్నాయి. దీంతో వాటిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చనిపోయిన వారు ముగ్గురేనా.. ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మంటలు అదుపులోకి వస్తే తప్ప పూర్తి వివరాలు తెలియవని, మృతుల వివరాలు తెలుసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.

కాగా.. గతంలోనూ కాకినాడ జిల్లాలోని మల్లేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. తాడేపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరంతా అనకాపల్లి పేరంటమ్మ తల్లి గుడి ఉత్సవాల్లో కసింకోట వేషాలు వేయడానికి వెళుతున్నారని, ఈ సమయంలో మల్లేపల్లి దగ్గర టాటా మ్యాజిక్ వాహనం లారీని ఢీ కొట్టిందని తెలిపారు. మృతులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..