AP Poll Analysis: ఏపీలో గ్రౌండ్ రియాలిటీ ఇదే.. టీవీ9 పొలిటికల్ అనాలసిస్

పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌.. ఇటీవల కాలంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా వినిపిస్తున్న మాట. ఎమ్మెల్యే నుంచి సీఎం దాకా స్ట్రాటజిస్ట్‌ చెప్పిందే చేయాలి.. వాళ్లు ఇచ్చిన ప్రసంగాన్నే చదవాలి. సొంత ఆలోచనలకు తావు లేదు.. విధానాలకు అసలే ఛాన్స్‌ లేదు. సంప్రదాయ పాతకాలపు రాజకీయాలకు భిన్నంగా ఆధునిక రాజకీయాలను శాసిస్తుంది స్ట్రాటజిస్టులే. వాళ్లు రూపొందించిన పద్దతిలోనే ప్రచారం జరగాలి.. వాళ్లు ఇచ్చిన నినాదాలనే జనాల్లోకి తీసుకెళ్లాలి. ఒక నాయకుడి ఇమేజ్‌ బిల్డ్‌ చేయాలన్నా.. ప్రత్యర్థి బ్రాండ్‌ పడేయాలన్నా స్ట్రాటజిస్టుల సాయం కావాల్సిందే.

AP Poll Analysis: ఏపీలో గ్రౌండ్ రియాలిటీ ఇదే.. టీవీ9 పొలిటికల్ అనాలసిస్
TV9 Poll Analysis
Follow us
Ram Naramaneni

|

Updated on: May 31, 2024 | 7:12 PM

రాజకీయాలంటే ఒకప్పుడు సామాజికబాధ్యత. జనాలకు నాయకుడి పట్ల ఓ అభిప్రాయం ఉండేది. నడవడిక.. చేసిన పనులు ఓ ఇమేజ్‌ ఇచ్చేవి. సొంతంగానే నేతలు గుర్తింపు సాధించుకునేవాళ్లు. అయితే అదంతా గతం.. ఇప్పుడు నాయకుడు జనాల్లోకి పోవాల్సిన అవసరం లేదు. పనులతో జనాన్ని ఆకట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓ స్ట్రాటజిస్టును పెట్టుకుంటే చాలు.. వాళ్లు అన్నీ సిద్ధచేసి రెడీమేడ్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసి జనాల్లోకి పంపుతారు.

నాయకుల వ్యక్తిత్వానికి అనుగుణంగా ఇమేజ్‌ క్రియేట్‌ చేస్తారు. అదే సమయంలో ప్రత్యర్థి ఇమేజ్‌ పడిపోయేలా నెగిటీవ్‌ ప్రచారం కూడా జరుగుతుంది. వీటిని బలంగా జనాల్లోకి తీసుకెళ్లడానికి కేడర్‌తో పాటు మీడియా, సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాంల ప్రయోగిస్తారు. టెక్నాలజీ ద్వారా ప్రజల మెదడుల్లోకి బలంగా తీసుకెళతారు. అలా పబ్లిక్‌లో పార్టీకి లేదా నాయకుడికి ఓ బ్రాండ్‌ పడిపోతోంది. విధానాలు, సిద్దాంతాలు కాకుండా.. స్ట్రాటజిస్టులు ఇచ్చే నేరేషన్‌ చుట్టూ ప్రచారం సాగుతుంది. వాటిచుట్టూనే జనాల్లో చర్చ జరిగేలా చేస్తారు.

దేశంలో 2014నుంచి ఎన్నికల వ్యూహకర్తల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ప్రజల పల్స్‌ పట్టేందుకు సర్వేలు చేయడం, వారి సమస్యలు తెలుసుకోవడం, ఎన్నికల్లో ప్రభావితం చేసే సమాచారాన్ని రాబట్టడం. వాటికి అనుగుణంగా నినాదాలు తయారుచేసి జనాల్లోకి పంపడం వాళ్లపని. చివరకు మేనిఫెస్టో రూపకల్పనలో సలహాలు, సూచనలతో పాటు నాయకుల ప్రసంగాలు కూడా వీళ్లే ఇస్తుంటారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…