YS Jagan: టీవీ9 ఎఫెక్ట్.. లంక గ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. వంతెన కోసం రూ.50 కోట్లు మంజూరు..

|

Oct 18, 2022 | 9:09 AM

లంక గ్రామాల ప్రజల వరద కష్టాలపై టీవీ9 వరుస కథనాలకు స్పందించిన ఏపీ ప్రభుత్వం బ్రిడ్జ్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. లంక గ్రామాల ఎన్నో దశాబ్దాల కల నెరవేర్చారు సీఎం జగన్.

YS Jagan: టీవీ9 ఎఫెక్ట్.. లంక గ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. వంతెన కోసం రూ.50 కోట్లు మంజూరు..
Ys Jagan
Follow us on

లంక గ్రామాల ప్రజల వరద కష్టాలపై టీవీ9 వరుస కథనాలకు స్పందించిన ఏపీ ప్రభుత్వం బ్రిడ్జ్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. లంక గ్రామాల ఎన్నో దశాబ్దాల కల నెరవేర్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడిముడి లంక గ్రామాల ప్రజల కల నెరుతుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఊడిముడి లంక వంతెనకు రూ.50 కోట్లు మంజూరు చేశారు ఏపీ సీఎం జగన్‌. వరదల సమయంలో ఊడిముడి లంకలో సీఎం జగన్‌ స్వయంగా పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. రెండు నెలల్లోనే వంతెన నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. మాట ఇచ్చినట్టుగానే సీఎం జగన్ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేశారు.

వరదల సమయంలో నాలుగు నెలలపాటు పడవలపైనే ప్రయాణాలు సాగాయి. ఊడిముడి లంకతో పాటు నాలుగు గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవనం సాగించారు . ఈ లంకగ్రామాల ప్రజల అవస్థలపై టీవీ9 క్యాంపెయిన్‌ చేసింది. వరుస కథనాలు ప్రసారం చేసింది. వరదల్లో ప్రజలు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టింది. దీంతో స్పందించిన ప్రభుత్వం ఆ నాలుగు గ్రామాల ప్రజల కష్టాలను తీరుస్తుంది.

మొన్న ఏజెన్సీలో తాళ్లపై వాగు దాటుతున్న విద్యార్థుల కష్టాలపై టీవీ9 కథనాలతో అధికారులు అలెర్ట్‌ అయ్యారు. కోనసీమలోని పలు కాజ్వేల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారు. టీవీ9 కథనాల వల్లే తమ గ్రామాలకు వరద కష్టాలు తీరుతున్నాయని లంక గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..