Tirupati Result: దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి..అదే ఎక్కువ..పవన్ కళ్యాణ్ లేకపోతే అదీ లేదు..బీజేపీ పై పేలుతున్న సెటైర్లు!

|

May 02, 2021 | 4:55 PM

తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార వైసీపీ పార్టీ ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో 57 శాతం ఓటింగ్ తో..2 లక్షల 31 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్ధి గురుమూర్తి గెలుపొందారు.

Tirupati Result: దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి..అదే ఎక్కువ..పవన్ కళ్యాణ్ లేకపోతే అదీ లేదు..బీజేపీ పై పేలుతున్న సెటైర్లు!
Pawan Kalyan And Somu Verraju
Follow us on

Tirupati Result: తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార వైసీపీ పార్టీ ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో 57 శాతం ఓటింగ్ తో..2 లక్షల 31 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్ధి గురుమూర్తి గెలుపొందారు. ఇక్కడ మేమే గెలుస్తాం..అని చెబుతూ వచ్చిన బీజేపీ మూడో స్థానంలో (5.4శాతం ఓట్లతో) నిలిచింది. ఒకరకంగా ఇది ఆ పార్టీకి గట్టి దెబ్బే. ఎందుకంటే, జనసేనతో పొత్తు పెట్టుకుని తప్పనిసరిగా ఇక్కడ పాగా వేయాలని పావులు కదిపింది బీజేపీ. అయితే, ఇక్కడ వైసేపీ వ్యూహాల ముందు ఏ పార్టీ నిలబడలేకపోయింది.

ఇదిలా ఉంటె, తిరుపతిలో బీజేపీ పరిస్థితిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ వర్గాల నుంచి మీమ్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. బీజేపీ ఒక్క రౌండ్ లో కూడా మెజారిటీ కాదు కదా రెండో స్థానంలోకి కూడా రాలేదు. దీంతో బీజేపీ టార్గెట్ గా కౌంటర్లు వచ్చి పడుతున్నాయి.

పవన్ కళ్యాన్ పుణ్యమా అని కమల దళానికి ఈసారి కొంత ఊరట లభించిందని నెటిజన్లు అంటున్నారు. దానికి వారు గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్ల లెక్కను చూపిస్తున్నారు. గత ఎన్నికల కంటె బీజేపీ గెలిచేసినట్టే అంటున్నారు. ఇంతకీ ఎవరి మీద గెలిచింది అని అనుకుంటే.. వారు నోటా చూపిస్తున్నారు. గత ఎన్నికల కంటె ఈసారి నోటా ను దాటి బీజేపీ పెర్ఫార్మెన్స్ చేసింది అని కామెంట్స్ చేస్తున్నారు.

వారి లెక్కలు ఇలా ఉన్నాయి.. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అప్పుడు నోటాకు 25,781 ఓట్లు వస్తే.. బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరిరావుకు 16,125 ఓట్లు మాత్రమే వచ్చాయి. జనసేనతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీకి 20,971 ఓట్లు వచ్చాయి. అంటే బీఎస్పీ ఓట్లు జనసేనవే అని వారంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నోటాకు 11,509ఓట్లు వచ్చాయి. బీజేపీకి 43,317 ఓట్లు వచ్చాయి. అంటే, నోటా కంటె ఎక్కువ. అయితే, ఈ ఓట్లు పవన్ కళ్యాన్ పుణ్యమా అని వచ్చాయి అని టీడీపీ, వైసీపీ రెండు పార్టీల అభిమానులూ అంటున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన తో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ దాదాపు 21 వేల ఓట్లు సాధించింది. ఈసారి బీజేపీ పవన్ తో పొత్తు వల్లే ఆమాత్రం ఓట్లు వచ్చాయంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

బీజేపీ మీద పేలుతున్న సెటైర్ లలో కొన్ని..


Also Read: Tirupati By Election Results 2021 LIVE: తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు.. కొనసాగుతోన్న వైసీపీ హావా.!

Oxygen: ఏపీకి ఒడిశా నుంచి ఆక్సిజన్..కార్గో విమానంలో అక్కడికి రెండు ఖాళీ టాంకర్లు పంపిన ప్రభుత్వం