వివాహేతర సంబంధం వారిద్దరి మధ్య చిచ్చు రేపింది. తనతో వివాహేతర సంబంధం(Illegal contact) పెట్టుకున్న మహిళ.. మరో వ్యక్తితో సంబంధం నడపడాన్ని అతను తట్టుకోలేకపోయాడు. ఈ విషయమై ఇద్దరినీ హెచ్చరించాడు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో కక్ష పెంచుకున్నాడు. తన స్నేహితులతో కలిసి ఆ వ్యక్తిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ముందస్తు పథకం ప్రకారం.. మద్యం తాగుదామని పిలిచి వివాదం పెట్టుకున్నాడు. మాటామాటా పెరిగి దాడి చేసుకున్నారు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు సమీపంలోని పొలంలోకి వెళ్లాడు. నిందితులు అతనిని వదలకుండా వెంటాడి మరీ పొలంలోనే దారుణంగా హత్య(Murder) చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని మూడు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. చివరగా ముగ్గురు నిందితులను ఈ నెల 25న మధ్యాహ్నం పట్టుకుని అరెస్టు(Arrest) చేశారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన సాంబయ్య.. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై తరచూ తాగి వేధింపులకు గురి చేస్తుండటంతో అతని భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. అదే గ్రామానికి చెందిన తంబి అనే వ్యక్తి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత కొంత కాలం నుంచి ఆమె సాంబయ్యతోనూ చనువుగా ఉంటుంది. విషయం తెలుసుకున్న తంబి సాంబయ్యను హెచ్చరించాడు. అయినా ఎటువంటి మార్పు రాకపోవడంతో సాంబయ్యపై కక్ష పెంచుకున్నాడు. హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి తన స్నేహితులను సంప్రదించాడు. వారు అంగీకరించడంతో హత్యకు ప్రణాళిక రచించారు. ఈ నెల 19న నిందితులు ముగ్గురూ మద్యం తాగుదామని సాంబయ్యను మద్యం దుకాణానికి తీసుకెళ్లారు.
పూటుగా మద్యం తాగించి, వివాహేతర సంబంధం ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ విషయమై సాంబయ్య, తంబి మధ్య మాటామాటా పెరిగింది. ఇదే అదనుగా భావించిన తంబి.. సాంబయ్యపై దాడి చేశాడు. వారి దాడి నుంచి సాంబయ్య ఎలాగోలా తప్పించుకుని సమీపంలోని పొలంలోకి వెళ్లాడు. అయినా సాంబయ్యను వదలకుండా తంబి, అతని స్నేహితులు సాంబయ్యను వెంబడించి, పొలంలో హతమార్చారు. సమాచారం అందుకున్న సాంబయ్య తండ్రి ప్రసాద్ ఫిర్యాదుతో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆరీఫ్ హాఫీజ్ ఆదేశాల మేరకు మంగళగిరి డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముగ్గురు నిందితులను ఈ నెల 25న మధ్యాహ్నం పట్టుకుని అరెస్టు చేశారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
Also Read
వీటిని అధికంగా తీసుకుంటున్నారా.? మీ గుండె ప్రమాదంలో పడ్డట్లే.
Viral Video: పిల్లి పాము మధ్య భీకరమైన ఫైట్ !! వీడియో
ఆకాశం నుంచి కుప్పలు తెప్పలుగా పడ్డ పక్షులు !! ఇంతకీ వేటాడిండెవరు ?? వీడియో