Andhra Pradesh: నంద్యాలలో రెచ్చిపోయిన దొంగలు.. అభయాంజనేయస్వామి ఆలయంలో హుండీ, దేవుడి ఆభరణాలు చోరీ

| Edited By: Srilakshmi C

Dec 26, 2023 | 11:41 AM

ఉమ్మడి కర్నూలు జిల్లాలో దొంగలు ఆలయాలపై పడ్డారు. గుడుల్లోని హుండీలను, దేవుళ్ళ ఆభరణాలను చోరీ చేయడం గత కొన్ని రోజులుగా ఎక్కువైంది. తాజాగా నంద్యాలలోని ఆంజనేయ స్వామి ఆలయానికి ఈ పరిస్థితి ఏర్పడింది. నంద్యాలలో రోజు రోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. సోమవారం అర్థరాత్రి టెక్కె సమీపంలోని ప్రధాన రహదారి వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో చోరి జరగడం..

నంద్యాల, డిసెంబర్‌ 26: ఉమ్మడి కర్నూలు జిల్లాలో దొంగలు ఆలయాలపై పడ్డారు. గుడుల్లోని హుండీలను, దేవుళ్ళ ఆభరణాలను చోరీ చేయడం గత కొన్ని రోజులుగా ఎక్కువైంది. తాజాగా నంద్యాలలోని ఆంజనేయ స్వామి ఆలయానికి ఈ పరిస్థితి ఏర్పడింది. నంద్యాలలో రోజు రోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. సోమవారం అర్థరాత్రి టెక్కె సమీపంలోని ప్రధాన రహదారి వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో చోరి జరగడం కలకలం రేపింది. టెక్కెలో గల అభయాంజనేయస్వామి ఆలయంకు యధావిధిగా రాత్రి పూజలు నిర్వహించి పూజారులు తాళాలు వేసి వెళ్లారు.

ఆలయంలో ఉన్న పెద్ద హుండీని గమనించిన దొంగలు ఆలయ ప్రధాన ద్వారం తాళం పగలగొట్టారు. ఆలయంలో ఉన్న హుండీని దొంగలు ఎత్తుకెళ్ళారు. ఆలయం సమీపంలో ఉన్న మార్కెట్ యార్డ్ లోని హుండీ ని తీసుకెళ్ళారు. అక్కడ హుండీలోని నగదు తీసుకొని హుండీని అక్కడే వదిలి వెళ్ళిపోయారు. ఉదయం వచ్చిన ఆలయ పూజారులు అలయంలో హుండీ చోరి జరిగినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుండీ మాయం అయిందని గమనించి హుండీ కోసం పోలీసులు, ఆలయ నిర్వహకులు గాలించగా మార్కెట్ యార్డ్ లో ఓ నిర్మానుషమైన ప్రదేశంలో హుండీని కనుగొన్నారు. హుండీలోని దాదాపు రూ. 50 వేల నగదు చోరికి గురైనట్లు ‌నిర్వహకులు తెలిపారు.

గత కొంత కాలంగా టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళం వేసిన ఇండ్లను, వృద్దులు ఒంటరిగా ఉన్న ఇండ్లను దొంగలు టార్టెట్ చేస్తున్నారు. ఇప్పటికైన పోలీసుల పహారా పెంచి రక్షణ కల్పించాలను స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.