AP News: బైకర్స్ అలెర్ట్.. లేకుంటే మీక్కూడా ఇదే గతి.!

| Edited By: Velpula Bharath Rao

Oct 18, 2024 | 7:49 PM

ఒంగోలులో పెద్ద శబ్దంతో రోడ్లపై దూసుకుపోతున్న బైక్‌లను పోలీసులు అడ్డుకుని వాటిని సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలులో 500పైగా స్వాధీనం చేసుకున్న మాడిఫైడ్ సైలెన్సర్లను అదే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా వాటిని బుల్‌డోజర్లతో తొక్కించి నలిపేశారు. వారికి జరిమానా కూడా విధించారు.

AP News: బైకర్స్ అలెర్ట్.. లేకుంటే మీక్కూడా ఇదే గతి.!
Modified Silencers Seize
Follow us on

ఒంగోలులో బైక్‌ రేసర్ల ఆగడాలకు జనం బెంబేలెత్తుతున్నారు. రోడ్డు పక్కనుంచి రయ్యి రయ్యిమంటూ పెద్ద శబ్దంతో దూసుకుపోతున్న బైకర్ల ధాటికి వృద్దులు, మహిళలు హడలిపోతున్నారు. బైక్‌ సైలెన్సలర్లను మాడిఫైడ్ చేసి ఎక్కువ శబ్దం వచ్చేలా తయారు చేసిన సైలెన్సర్లను అమర్చి రోడ్లపై దూసుకుపోతున్న బైకర్ల ఆగడాలు శృతి మించడంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పెద్ద శబ్దంతో రోడ్లపై దూసుకుపోతున్న బైక్‌లను అడ్డుకుని వాటిని సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలులో 500పైగా స్వాధీనం చేసుకున్న మాడిఫైడ్ సైలెన్సర్లను అదే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా వాటిని బుల్‌డోజర్లతో తొక్కించి నలిపేశారు. వారికి జరిమానా కూడా విధించారు.

వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగకుండా రోడ్డు భద్రతా నియమాలను పాటించేలా చూడటమే లక్ష్యంగా ఒంగోలు నగర పరిధిలో విపరీతమైన ధ్వని పుట్టించే బైక్‌ సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేస్తున్నట్టు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ తెలిపారు. నెల రోజులుగా ఒంగోలు టౌన్ పరిధిలో ట్రాఫిక్ పోలీస్లు స్పెషల్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి ద్విచక్ర వాహనాలకు మాడిఫైడ్ సైలెన్సర్ల ద్వారా అధిక శబ్దం చేసే 515 సైలెన్సర్లను స్వాధీనం చేసుకోగా వాటిని ఎస్‌పీ ఆధ్వర్యంలో పోలీసులు రోడ్డురోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ఒంగోలులోని అద్దంకి సెంటర్ దగ్గర స్వాధీనం చేసుకున్న అధిక శబ్దాలు చేసే సైలెన్సర్లను జనం అంతా చూస్తుండగా ధ్వంసం చేశారు. నంబర్‌ ప్లేట్లు లేని, ఇర్రెగ్యులర్ నంబర్‌ ప్లేట్లు ఉన్న వాటిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. మోటార్ వాహనాల చట్టం నిబంధనలు ఉల్లంఘించి మాడిఫైడ్ సైలెన్సర్లతో ప్రయాణించే వాహనాలను ఉపేక్షించమని హెచ్చరించారు.బైకులకు విపరీత శబ్దాన్నిచ్చే సైలెన్సర్ అమర్చుకుని శబ్ద కాలుష్యం సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా జరిమానా విధిస్తామని, వాహనాలకు మాడిఫైడ్ సైలెన్సర్లను విక్రయించే షాపుల యజమానులు, వాటిని బిగించే మెకానిక్ లపై కూడా చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్‌ హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.