Andhra Pradesh: 100 రోజులు.. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్.. ఇంటింటికి కూటమి ఎమ్మెల్యేలు..

|

Sep 19, 2024 | 7:54 AM

చంద్రబాబు 4.0 పాలన ఎలాంటి ఆర్భాటాలు లేకుండా 100 రోజులు పూర్తయింది. అపోజిషన్‌లో ఉన్నప్పుడు పవర్‌లోకి వస్తే ఏం చేస్తామో చెప్పిన చంద్రబాబు.. చెప్పిట్లుగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఈ వందరోజుల కూటమి సర్కార్ పనితీరు ఎలా ఉంది ? ఇన్ని రోజుల్లో సాధించిందేంటి ? భారీ మెజార్టీ ఇచ్చిన జనం ఆకాంక్షలు నెరవేర్చే దిశగానే వెళ్తుందా?

Andhra Pradesh: 100 రోజులు.. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్.. ఇంటింటికి కూటమి ఎమ్మెల్యేలు..
Pawan Kalyan -Chandrababu
Follow us on

ఎన్నో ఆశయాలతో ప్రజలు కట్టబెట్టిన అధికారం.. ప్రజల్లో భరోసా కల్పించి ఏర్పడిన ప్రభుత్వం.. సవాళ్లు.. ప్రతి సవాళ్ల మధ్య చేపట్టిన బాధ్యతలు.. ఇచ్చిన హామీలను అమలు చేయాలనే లక్ష్యం.. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ .. మూడు పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని ఆకాంక్ష.. ఇలా చంద్రబాబు 4.0 పాలన ఎలాంటి ఆర్భాటాలు లేకుండా 100 రోజులు అయింది. రేపటితో వందరోజులు పూర్తికానుంది. అపోజిషన్‌లో ఉన్నప్పుడు పవర్‌లోకి వస్తే ఏం చేస్తామో చెప్పిన చంద్రబాబు.. చెప్పిట్లుగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఈ వందరోజుల కూటమి సర్కార్ పనితీరు ఎలా ఉంది ? ఇన్ని రోజుల్లో సాధించిందేంటి ? భారీ మెజార్టీ ఇచ్చిన జనం ఆకాంక్షలు నెరవేర్చే దిశగానే వెళ్తుందా?

ఏవో హామీలిచ్చాం.. అధికారంలోకి వచ్చాం.. అని లైట్ తీసుకోలేదు. ఇచ్చిన హామీలను అమలు చేయాలనే లక్ష్యం. ఇవే ప్రధాన అంశాలుగా సీఎం చంద్రబాబు 100 రోజుల పాలన కొనసాగింది. అంతర్గతంగా ఎలాంటి వివాదాల్లేకుండా 100 రోజుల కూటమి పాలన సాగింది. పాలనలో పార్టీ పరమైన జోక్యం కనిపించలేదు. మూడు పార్టీల సమన్వయంతో పాలన సాగించారు. మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. సంక్షేమ ఫలాలు అందిస్తూనే అభివృద్దివైపు అడుగులు వేశారు చంద్రబాబు. ఇప్పటికే తన అనుభవంతో ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు తెస్తూ ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ పేరుతో పబ్లిక్‌ను అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూడు పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అభివృద్ధితో పాటు మన నడవడిక ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. భవిష్యత్‌లో చేసేవి కూడా మనం చెప్పాలంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. ఇసుక విషయంలో మూడు పార్టీల నేతల జోక్యం వద్దంటూ సూచించారు. కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దని.. తప్పులు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామంటూ పేర్కొన్నారు. 100 రోజుల పాలనను ప్రజలకు వివరించాలని.. ఈ బాధ్యత కూటమి నేతలదే అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

చంద్రబాబు పాలనతీరుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫిదా అయ్యారు. చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేవలం 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చామని… సంక్షేమంలో చంద్రబాబు తిరుగులేని చరిత్ర సృష్టించారన్నారు. సీఎం చంద్రబాబు దార్శనికుడు, అనునిత్యం ఆశ్యర్యపరుస్తూనే ఉంటారన్నారు. ఆయనకు ఉన్న జ్ఞానాన్ని, ఓపికని చూసి ఆశ్చర్యం కలుగుతుందన్నారు చంద్రబాబు.

ఈనెల 20-26 వరకు ఇంటింటికీ ఎమ్మెల్యేలు కార్యక్రమం

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో… ఎన్డీయే ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలుపై చర్చించారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లేలా కార్యాచరణ రూపొందించారు. వందరోజుల పాలన ప్రగతిని “ఇది మంచి ప్రభుత్వం”పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. 100 రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరించే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..