PAC chairman: పీఏసీ చైర్మన్‌ పదవిపై తొలగిన ఉత్కంఠ.. మరోసారి ప్రతిపక్ష వైసీపీ షాక్‌!

| Edited By: Balaraju Goud

Nov 21, 2024 | 7:08 PM

అవసరమైన 20 మంది సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో లేని నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏసీ ఎన్నికయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

PAC chairman: పీఏసీ చైర్మన్‌ పదవిపై తొలగిన ఉత్కంఠ.. మరోసారి ప్రతిపక్ష వైసీపీ షాక్‌!
Ys Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పీఏసీ చైర్మన్ ఎంపిక సైతం వైసీపీకి కలిసివచ్చినట్లు కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించి అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం చతికిల పడాల్సి వచ్చింది. దీంతో కేవలం 11 అంటే 11 సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితం కావలసి వచ్చింది. దీంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో శాసనసభలో కనీసం ప్రతిపక్ష హోదా లేదన్న విమర్శలను మూటకట్టుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

అయితే ప్రతిపక్ష హోదా ఉండాలి అంటే కనీసమైన సభ్యుల సంఖ్య ఉండాలన్న నిబంధనలు చెబుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్టును సైతం ఆశ్రయించింది. అయితే అనూహ్యంగా సభలో కీలకమైన బాధ్యతలు చేపట్టే పీఏసీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వవలసి ఉంటుందని వైసీపీ పట్టుపడుతోంది. ప్రధాన ప్రతిపక్షం పదవి కట్టుబెట్టాలన్న నిబంధనలు చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతం శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం హోదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కేలా లేదనిపిస్తోంది. ఋ నేపథ్యంలో ఎవరు ఆ బాధ్యతను చేపడుతారని ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో జనసేనకు ఛాన్స్ దక్కేలా కనిపిస్తోంది. జనసేన నుంచి పులపర్తి ఆంజనేయులు పేరును ఆపార్ట అధినేత, డిఫ్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సూచించినట్లు సమాచారం. దీంతో పీఏసీ చైర్మన్‌ పదవిపై ఉత్కంఠ తొలిగింది.

పీఏసీ చైర్మన్‌గా మొదట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చంద్రశేఖర్లతో కలిసి నామినేషన్లు దాఖలు చేయగా చివరి నిమిషంలో 20 మంది సభ్యులు ఉంటేనే పీఏసీ చైర్మన్‌గా నియమిస్తారని పీఏసీ సభ్యులుగా ఎంపిక కావాలన్నా, చైర్మన్‌గా ఎంపిక కావాలన్నా 20 మంది సభ్యుల మద్దతు కావాలని నిబంధనలు చెబుతున్నాయి. ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది అధికార కూటమి.

దీంతో అవసరమైన 20 మంది సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో లేని నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏసీ ఎన్నికయ్యే అవకాశం లేదని చర్చ నడుస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం నుంచి 12 నామినేషన్లు దాఖలు కాగా పీఏసీలో మొత్తం 12 మంది సభ్యులు అందులో 9 మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. అయితే మొత్తం అన్ని సభ్యులకు కూటమి ప్రభుత్వమే నామినేషన్ దాఖలు చేసింది.

పీఏసీ చైర్మన్‌గా 2014 – 2019 మధ్య బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, 2019 – 2024 మధ్య పయ్యావుల కేశవ్ బాధ్యతలను నిర్వర్తించగా, తాజాగా 2024 – 2029 మధ్య ప్రతిపక్ష హోదా లేని పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండటంతో ఆ బాధ్యతలను కూటమి ప్రభుత్వంలోని కీలక నేతకు కట్టబెట్టే అవకాశం ఉంది. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోవడం సభలో సంఖ్యాబలం లేని కారణంగా ప్రతిపక్ష హోదా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేన నేపథ్యంలో పీఏసీ చైర్మన్ నియామకం కూడా దక్కదన్న చర్చ నడుస్తోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తమకు 40 శాతం ఓట్‌ షేర్ ఉందని శాసనసభలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండే ఉంటాయి. కాబట్టి ఆదిశగా నిర్ణయం తీసుకోవాలని వైసిపి డిమాండ్ చేస్తుంది. కాగా, అధికారం కోల్పోయిన వైసీపీకి తాజా ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పెద్ద దెబ్బ తగిలితే, ఇప్పుడు కీలకమైన పీఏసీ చైర్మన్ పదవి సైతం చేజారినట్లు కనిపిస్తోంది..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..