AP Inter Exams: జూలైలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం.! త్వరలోనే తుది నిర్ణయం: ఆదిమూలపు సురేష్

|

Jun 15, 2021 | 7:10 PM

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని.. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కొద్దిరోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..

AP Inter Exams: జూలైలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం.! త్వరలోనే తుది నిర్ణయం: ఆదిమూలపు సురేష్
Minister Adimulapu Suresh
Follow us on

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని.. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కొద్దిరోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. జూలై మొదటివారంలో ఇంటర్ పరీక్షలు, జూలై నెలాఖరున టెన్త్ పరీక్షలు నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ అంశంపై గురువారం సీఎం జగన్‌తో చర్చించి.. పరీక్షలపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎగ్జామ్స్ రద్దు చేయడానికి నిమిషం పట్టదని చెప్పిన మంత్రి.. విద్యార్ధుల భవిష్యత్తు, ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం చాలా బాధ్యతగా వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు.

డీఎస్సీ 2008 ఎగ్జామ్స్‌ అంశంపై మంత్రి కామెంట్స్…

గత ప్రభుత్వాలు డీఎస్సీ అభ్యర్థులను పట్టించుకోలేదని.. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. డీఎస్పీ-2008 సమస్య 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందన్నారు. అభ్యర్థుల భవితవ్యంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో వ్యవహరించారని పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్ధులను ఎస్జీటీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 2014 మేనిఫెస్టోలో డీఎస్సీ 2008 అభ్యర్థుల అంశాన్ని పెట్టి టీడీపీ డీఎస్సీ అభ్యర్థుల్ని మోసం చేసిందని సురేష్‌ విమర్శించారు.

Also Read:

ఈ పాత రూ. 2 నాణెంతో లక్షలు సంపాదించవచ్చు.? ఎలాగో మీరే తెలుసుకోండి.!

అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్‌.. వైరల్ అవుతున్న వీడియో..

జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ కోర్సులు.. ఉత్తర్వులు జారీ

 కుండలో నీరు తాగుతున్నారా? అయితే ఈ సూపర్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి!