AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Kodali Nani – Casino: కేసినో రచ్చ.. కొడాలి నానిపై చర్యలేవంటూ డీజీపీకి వర్ల ఘాటు లేఖ..

Minister Kodali Nani - Casino: గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కేసినో రచ్చ..

Minister Kodali Nani - Casino: కేసినో రచ్చ.. కొడాలి నానిపై చర్యలేవంటూ డీజీపీకి వర్ల ఘాటు లేఖ..
Shiva Prajapati
|

Updated on: Jan 19, 2022 | 6:18 PM

Share

Minister Kodali Nani – Casino: గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కేసినో రచ్చ.. ఇంకా రగులుతూనే ఉంది. కేసినో వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య బహిరంగ లేఖ రాశారు. కేసినోను గుడివాడకు రప్పించి జాతీయస్థాయిలో రాష్ట్రం పరువు తీశారని లేఖలో విమర్శలు గుప్పించారు. మెట్రోపాలిటన్ నగరాలైన ముంబై, కలకత్తా, బెంగుళూరు, చెన్నై సహా దేశంలో ఎక్కడా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు లేవన్నారు. కేసినో నిర్వహణ అంశంపై పోలీసు యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు వర్ల రామయ్య. దీనిపై విచారణకు ఆదేశించిన తీరు దొంగలు పడ్డ తర్వాత కుక్కలు మొరిగినట్లుగా ఉందంటూ తీవ్ర పదజాలంతో నిప్పులు చెరిగారు.

ఒక డిఎస్పీస్థాయి అధికారి తప్పుచేస్తే మరొక డిఎస్పీతో విచారణకు ఆదేశిస్తారా? అని లేఖలో ప్రశ్నించారు. గతంలో గుడివాడలో గ్యాంబ్లింగ్ కేసు మాదిరిగానే దీనిని కూడా మమ అనిపిస్తారనే సందేహం వ్యక్తం చేశారు రామయ్య. చట్టం అనుమతించని అసాంఘిక క్రీడపై రూ.500 కోట్ల లావాదేవీలు చిన్న విషయమా? అని నిలదీశారు. మీడియా సాక్షిగా అంతా బహిరంగమయ్యాక ఇంకా విచారణ పేరుతో సాగదీత ఏంటని డీజీపీపై ప్రశ్నల వర్షం కురిపించారు. కేసినో నిర్వహణకు బాధ్యులైన మంత్రి కొడాలి నాని, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అవకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Also read:

Viral Video: తగ్గేదేలే.! చిరుతతో కుక్క ఫైటింగ్.. చివరికి ఎవరో గెలిచారో చూస్తే షాకవ్వాల్సిందే!

The Ghost: నాగ్ సినిమా నుంచి కాజల్ ఔట్.. హీరోయిన్‌గా ఆ బాలీవుడ్ బ్యూటీ?

Telangana Govt Hospitals: వద్దన్న నోటితోనే నీరాజం పలుకుతున్న జనాలు.. ‘దటీస్ గవర్నమెంట్ హాస్పిటల్’ అంటున్న అధికారులు..