Andhra Pradesh: కాలర్ ఎగరేసుకుని తిరుగుదామనుకుంటే.. కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారు.. వైసీపీపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

|

Aug 05, 2022 | 1:22 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్న చంద్రబాబు (Chandrababu Naidu).. పాలనను ప్రశ్నించిన వారిపై కేసులు..

Andhra Pradesh: కాలర్ ఎగరేసుకుని తిరుగుదామనుకుంటే.. కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారు.. వైసీపీపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
Chandrababu Naidu
Follow us on

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్న చంద్రబాబు (Chandrababu Naidu).. పాలనను ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అలా చేయాలనుకుంటే రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలపై పెట్టాలని విమర్శించారు. సంక్షేమ పథకాల్లో కోతల కారణంగా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతపై వైసీపీ (YCP) అసహనానికి గురవుతోందని ఆక్షేపించారు. విద్యాదీవెనపై ప్రశ్నించిన చిత్తూరు జిల్లాకు చెందిన విద్యార్థిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులపై కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని వైసీపీ పై మండిపడ్డారు. వైసీపీ పాలనను ప్రజలు నమ్మట్లేదని, ప్రతి ఇంటి నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని చెప్పారు. కాలర్‌ ఎగరేసుకుని తిరుగుదామనుకున్న పార్టీ నేతలను.. ప్రజలు కాలర్‌ పట్టుకుని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థిపై పెట్టిన కేసును వెనక్కు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. స్థానిక పోలీసుల తీరుపై డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు.

కాగా.. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ పోటీ చేసే అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాలనలో కంటే గత మూడేళ్లలోనే కుప్పం నియోజకవర్గం అభివృద్ధి సాధించిందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆ గెలుపు కుప్పం నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. కుప్పం తన సొంత నియోజకవర్గంతో సమానమన్న సీఎం జగన్.. ఇక్కడ భరత్‌ను గెలిపిస్తే.. ఆయనకు మంత్రి పదవి గ్యారెంటీ అని కుండబద్ధలు కొట్టారు. తక్షణమే కుప్పం మున్సిపాల్టీకి రూ.65 కోట్ల విలువైన పనుల నిధులను మంజూరు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..